×
Ad

Vishwak Sen : విశ్వక్ సేన్ కొత్త సినిమా అనౌన్స్.. మరోసారి పోలీసాఫీసర్ గా?

SLV సినిమాస్ బ్యానర్లో విశ్వక్ సేన్ హీరోగా కొత్త సినిమా నేడు ప్రకటించారు.

  • Published On : August 6, 2024 / 11:19 AM IST

Vishwak Sen New Movie Announced Vishwak will play Police Officer Role Rumours goes Viral

Vishwak Sen : విశ్వక్ సేన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిస్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టిన విశ్వక్ త్వరలో దీపావళికి మెకానిక్ రాకీ సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత లైలా అనే మరో సినిమాలో ఆడపిల్ల గెటప్ లో ప్రయోగం చేయబోతున్నాడు విశ్వక్. తాజాగా నేడు విశ్వక్ సేన్ కొత్త సినిమాని ప్రకటించారు.

SLV సినిమాస్ బ్యానర్లో విశ్వక్ సేన్ హీరోగా కొత్త సినిమా నేడు ప్రకటించారు. విశ్వక్ ఫేస్ కనిపించకుండా ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే విశ్వక్ మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈ పోస్టర్ పై ప్రతి యాక్షన్ కి అదిరిపోయే రియాక్షన్ ఉంటుంది అని కొటేషన్ ఇచ్చారు.

Also Read : Kalki 2 – Deepika Padukone : దీపికా పదుకోన్ వల్ల కల్కి 2 మరింత ఆలస్యం.. ఎందుకంటే..?

ఇక ఈ సినిమాని శ్రీధర్ గంట దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ సంగీతం అందిస్తున్నారు.