Kalki 2 – Deepika Padukone : దీపికా పదుకోన్ వల్ల కల్కి 2 మరింత ఆలస్యం.. ఎందుకంటే..?
అశ్వనీదత్, నాగ్ అశ్విన్ చెప్పిన గడువు కంటే, కల్కి-2 ప్రాజెక్టు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

Prabhas Nag Ashwin Kalki 2 Movie got More Delay Due to Deepika Padukone
Kalki 2 – Deepika Padukone : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ సినిమా ‘కల్కి 2898 ఎడి’. ఈ మూవీలో ప్రభాస్ సహా కమల్, అమితాబ్ లాంటి దిగ్గజాలు నటించడంతో ఇండియన్ సినిమా నుంచి మరో గ్రేట్ సినిమాగా నిలిచింది. 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి భారీ హిట్ గా నిలిచింది. పార్ట్ 1లో ఉన్న ఎన్నో ప్రశ్నలకి పార్ట్ 2లో సమాధానాలు దొరుకుతాయని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిర్మాత అశ్వినీదత్ కూడా పార్ట్ 2 షూటింగ్ కొంతభాగం అయింది. 2025లో మిగిలిన షూటింగ్ పూర్తిచేస్తాము అని తెలిపారు.
అయితే ఇలాంటి టైంలో సెకండ్ పార్ట్ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కల్కి2 వచ్చే ఏడాది జూన్, జులై కల్లా రిలీజ్ అయిపోతుందంటూ ఈ మధ్య ప్రకటించేశారు నిర్మాత అశ్వనీదత్. అదే టైమ్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. కల్కి-2 కోసం మరిన్ని ప్రపంచాలు సృష్టించబోతున్నానని సినిమా ఎప్పటికి పూర్తవుతుందనే విషయాన్ని అప్పుడే చెప్పలేనని క్లియర్ గా చెప్పేశాడు. ఇప్పుడిదంతా ఎందుకుంటే అశ్వనీదత్, నాగ్ అశ్విన్ చెప్పిన గడువు కంటే, కల్కి-2 ప్రాజెక్టు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.
Also Read : NTR – Mahesh Babu : మహేష్ బాబు పుట్టిన రోజుకి.. ఫ్యాన్స్‌కి ఎన్టీఆర్ గిఫ్ట్.. ?
కల్కి మూవీలో నటించిన దీపికా పదుకోన్ ప్రెగ్నెంట్ గా ఉన్నారు. సెప్టెంబర్ లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతోంది. దీంతో కల్కి-2 షూటింగ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని చాలామంది అనుకోవచ్చు. కానీ అసలు చిక్కు ఇక్కడే వచ్చిపడింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కనీసం ఏడాదిపాటు గ్యాప్ తీసుకొని తన బిడ్డకు సమయం కేటాయించాలని భావిస్తోందంట దీపిక పదుకోన్. దీని కోసం ఆమె తనకెంతో ఇష్టమైన రోహిత్ శెట్టి ప్రాజెక్టును కూడా కాదనుకుంది. ఇదే క్రమంలో ఆమె ఓ పాపులర్ బాలీవుడ్ షో సీజన్-3కి కూడా నో చెప్పిందంట.
ఇవన్నీ చూస్తుంటే ఆమె కల్కి-2 షూటింగ్ కు కూడా దూరమయ్యేలా ఉంది. సంక్రాంతి తర్వాత కల్కి-2ను సెట్స్ పైకి తీసుకురావాలని మూవీ యూనిట్ భావిస్తోంది. కానీ సినిమా కథ మొత్తం దీపిక పాత్ర చుట్టూనే తిరుగుతోంది. ఆమె ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అప్పుడే షూటింగ్ అని తెలుస్తుంది. దీంతో కల్కి 2 అనుకున్న దానికంటే ఆలస్యం అవుతుండటంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇక కల్కి 2 ఆలస్యం అవుతుండటంతో ఇప్పటికే ప్రభాస్ హను రాఘవపూడి సినిమా షూటింగ్ కి ఓకే చెప్పేసినట్టు సమాచారం.