NTR – Mahesh Babu : మహేష్ బాబు పుట్టిన రోజుకి.. ఫ్యాన్స్‌కి ఎన్టీఆర్ గిఫ్ట్.. ?
దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నాడు.

NTR Prashanth Neel Movie Pooja Ceremony on Mahesh Babu Birthday Rumours goes Viral
NTR – Mahesh Babu : ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్ట్ 1 సినిమా షూట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. నిన్నే దేవర సినిమా నుంచి ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్ రిలీజ్ చేసారు. దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుందని ఆల్రెడీ చిత్రయూనిట్ ప్రకటించారు. దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నాడు.
గతంలో నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ఆగస్టులో మొదలవుతుందని ప్రకటించింది. ఇది కూడా మాస్ ఎంటర్టైనింగ్ గానే ఉండబోతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తవ్వగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 9న ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించి ఆగస్టు చివర్లో షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తుంది.
Also Read : Balakrishna : ఆ సినిమా రీమేక్ చేయబోతున్న బాలయ్య..? రౌడీ రంగ..
ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టిన రోజు. మహేష్ ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించి రెండేళ్లు అవుతున్నా ఎలాంటి మొదలు లేదు. ఈసారైనా మహేష్ పుట్టిన రోజు నాడు అధికారికంగా ఏదైనా అప్డేట్ ఇస్తారేమో అని మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ మహేష్ – రాజమౌళి మూవీ టీమ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోయినా ఎన్టీఆర్ సినిమా అప్డేట్ మాత్రం రాబోతుందని రూమర్స్ వస్తున్నాయి. దీంతో మహేష్ పుట్టిన రోజుకు ఎన్టీఆర్ గిఫ్ట్ ఇస్తున్నాడు అని అంటున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.