Balakrishna : ఆ సినిమా రీమేక్ చేయబోతున్న బాలయ్య..? రౌడీ రంగ..

తాజాగా బాలయ్య ఓ సినిమా రీమేక్ చేయబోతున్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

Balakrishna : ఆ సినిమా రీమేక్ చేయబోతున్న బాలయ్య..? రౌడీ రంగ..

balakrishna will Remake Fahadh Faasil Aavesham Movie Rumours goes Viral

Updated On : August 6, 2024 / 9:51 AM IST

Balakrishna : బాలయ్య బాబు ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో, ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు 100 కోట్ల హ్యాట్రిక్ హిట్ కొట్టాడు బాలయ్య బాబు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో మరో యాక్షన్ సినిమా NBK109 చేస్తున్నాడు. ఈ సినిమాపై కూడా బాగానే అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా బాలయ్య ఓ సినిమా రీమేక్ చేయబోతున్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

మలయాళంలో ఫహద్ ఫాజిల్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ‘ఆవేశం’ సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ రంగ అనే ఓ రౌడీ పాత్రలో ఫుల్ యాక్టివ్ గా నటించాడు. కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ కి హెల్ప్ చేసే కథతో యాక్షన్ కామెడీగా ఆవేశం సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మళయాళంలోనే రిలీజ్ అయినా ఓటీటీలో అన్ని భాషల్లో హిట్ అయింది.

Also Read : Multi Starrer Movie: రామ్ చరణ్, అల్లు అర్జున్ మల్టీస్టారర్‌ మూవీ?

అయితే ఈ సినిమాని బాలకృష్ణ రీమేక్ చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రౌడీ రంగ పాత్రలో బాలయ్య నటిస్తాడని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమా రీమేక్ రైట్స్ కొనడానికి ప్రయత్నిస్తుందట. ఇదే నిజమైతే బాలయ్యని ఫుల్ యాక్టివ్ గా మరో కొత్త పాత్రలో చూడొచ్చు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి.