Vishwak Sen original name and reason why he change his name
Vishwak Sen : టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు ఆడియన్స్ కి చెప్పనవసరం లేదు. తన సినిమాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి మాస్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. నటుడి గానే కాదు దర్శకుడిగా కూడా ఇండస్ట్రీలో మంచి ఫేమ్ ని సంపాదించుకున్నాడు. ఇటీవల ‘దాస్ కా ధమ్కీ’ సినిమాతో దర్శకుడిగా మరో బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. అయితే విశ్వక్ అసలు పేరు ఏంటో మీలో ఎవరికైనా తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఇక్కడ తెలుసుకోండి.
Peddha Kapu 1 : ఓ సామాన్యుడి సంతకం.. పెదకాపు.. శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమా!
విశ్వక్ సేన్ అసలు పేరు.. దినేష్ నాయుడు. అయితే 2017 లో తన పేరుని ‘విశ్వక్ సేన్’గా మార్చుకున్నాడు ఈ హీరో. అందుకు కారణం ఏంటంటే.. విశ్వక్ నటించిన మొదటి సినిమా ‘వెళ్ళిపోమాకే’. ఆ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నా సరి 2 ఏళ్ళ వరకు ఆ సినిమా రిలీజ్ కాలేదు. దీంతో న్యూమరాలజీ ప్రకారం తన పేరుని మార్చుకోడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే నాలుగు పేరులను ఎంచుకోగా.. వాటిలో బెంగాలీ పేరు అయిన విశ్వక్ సేన్ ని ఎంచుకున్నాడు. ఆ పేరుని పెట్టుకున్న దగ్గర నుంచి తన దశ తిరిగిపోయిందట.
Pawan Kalyan : వారాహి షెడ్యూల్ రిలీజ్ చేసిన పవన్.. మరి మూవీ షెడ్యూల్స్ సంగతి ఏంటి?
ఆ పేరు మార్చుకున్న నెలలోనే తన మొదటి సినిమా ‘వెళ్ళిపోమాకే’ రిలీజ్ అయ్యింది. అంతేకాదు పేరు మార్చుకున్న 3 రోజుల్లోనే ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకి ఆడిషన్ ఇవ్వగా.. అక్కడ సెలెక్ట్ అయ్యాడు. ఇక మొదటి మూవీ పెద్దగా గుర్తింపు తీసుకురాకపోయిన ఈ నగరానికి ఏమైంది చిత్రం మంచి ఫేమ్ ని తెచ్చి పెట్టింది. ఇక మూడో చిత్రాన్ని తానే డైరెక్ట్ చేస్తూ.. ఒక మలయాళ మూవీని రీమేక్ చేశాడు. అదే ఫలక్‌నుమాదాస్ (Falaknuma Das) మూవీ. అది సూపర్ హిట్ అయ్యింది. తాజాగా ఆ మూవీ రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో దానికి సీక్వెల్ ని ప్రకటించాడు.