Vishwak Sen : షూటింగ్ లో లారీ మీద నుంచి పడిపోయా.. మోకాలికి దెబ్బ.. బాలయ్య ఫోన్ చేసి..

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా బాలయ్య బాబు ముఖ్య అతిధిగా వచ్చారు.

Vishwak Sen says Interesting thing about Balakrishna

Vishwak Sen : విశ్వక్‌ సేన్, నేహాశెట్టి (Neha Shetty) జంటగా అంజలి (Anjali) ముఖ్య పాత్రలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’( Gangs Of Godavari). ఈ సినిమా మే 31న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా బాలయ్య బాబు ముఖ్య అతిధిగా వచ్చారు.

Also Read : Bhaje Vaayu Vegam : ఎడిటింగ్ అయ్యాక హార్డ్ డిస్క్‌లు క్రాష్.. మళ్ళీ మొదట్నుంచి.. ‘భజే వాయువేగం’ సినిమా నాలుగేళ్ల కష్టాలు..

ఈ కార్యక్రమంలో విశ్వక్ మాట్లాడుతూ.. మీ అందరికి ఒక విషయం చెప్తాను. ఈ సినిమా షూటింగ్ సమయంలో నేను ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లారీ మీద నుంచి పడిపోయా, మోకాలికి దెబ్బ తగిలింది. ఆల్మోస్ట్ మోకాలు చిప్ప విరిగిపోయింది, రెండేళ్లు మంచానికే పరిమితం అవ్వాలి అనుకున్నాను. కానీ ఏం జరగలేదు, ట్రీట్మెంట్ తీసుకొని కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాను. ఆ సమయంలో బాలకృష్ణ గారు నాకు ఫోన్ చేసి దాదాపు పావుగంట మాట్లాడారు. నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన అలా అడిగేసరికి నేను ఏడ్చేసాను. ఆయన గొంతులో ఎప్పుడూ ఒక గాంబీర్యం ఉంటుంది కానీ నాకు ఇలా జరిగింది అని తెలిసాక ఆయన ఎక్కువ బాధపడ్డారు. నీ గురించి చాలా బాధపడుతున్నాను అని ఆయన అంటుంటే నాకు ఏడుపొచ్చేసింది. నా కుటుంబ సభ్యుల తర్వాత అంత ప్రేమ నాపై చూపించే బాలయ్య గారే అంటూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో విశ్వక్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.