Vishwambhara : చిరంజీవి ‘విశ్వంభ‌ర’ నుంచి ఫ‌స్ట్ సాంగ్ అప్‌డేట్‌.. ‘రామరామ’ పాట ఎప్పుడంటే..?

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న మూవీ విశ్వంభ‌ర‌

Vishwambhara First Single RamaRaama Update

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న మూవీ విశ్వంభ‌ర‌. ‘బింబిసారా’ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సోషియో ఫాంటసీ జానర్​ లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో త్రిష‌తో పాటు కునాల్ కపూర్, ఆషికా రంగనాథ్, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ మొత్తం ఐదుగురు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

Ram Charan : కమెడియన్ సత్య కాళ్ళు మొక్కిన రామ్ చరణ్.. సత్య చరణ్ ఇంటికి వెళ్లడంతో.. వీడియో వైరల్..

తాజాగా ఈ చిత్రం నుంచి అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ చిత్రంలో తొలి పాట‌ను ఎప్పుడు విడుద‌ల చేయ‌నున్నారు అన్న సంగ‌తిని చెప్పేశారు. రామ‌రామ అంటూ సాగే ఈ పాట‌ను ఏప్రిల్ 12న శ‌నివారం విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

Renu Desai : ఆ సినిమాని నాలుగు సార్లు చూసాను.. పడీ పడీ నవ్వాను.. రేణు దేశాయ్ కి కూడా ఆ సూపర్ హిట్ సినిమా ఇష్టం అంట..

ఈ పోస్ట‌ర్‌లో ఆంజ‌నేయుడి గెట‌ప్ చాలా మంది చిన్నారులు నిలుచొని ఉండ‌గా.. మ‌ధ్య‌లో చిరంజీవి ఓ చిన్నారిని భుజంపైకి ఎక్కించుకుని క‌నిపించాడు. చిరు వెనుక శ్రీరాముడి విగ్ర‌హం ఉంది. మొత్తంగా ఈ పోస్ట‌ర్ అదిరిపోయింది.  ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ వైర‌ల్ అవుతోంది. సాంగ్ కోసం వెయిటింగ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.