Vishwambhara
Vishwambhara : రేపు ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అని అందరికి తెలిసిందే. అసలే ఈసారి 70వ పుట్టిన రోజు కావడంతో మెగా ఫ్యాన్స్ ఈ పండగను ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి కూడా ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి ప్లాన్ చేసారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర, అనిల్ రావిపూడి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.(Vishwambhara)
ఈ రెండు సినిమాల నుంచి స్పెషల్ అప్డేట్స్ మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేయనున్నారు. నిన్నే చిరంజీవి నేడు మెగా బ్లాస్ట్ రాబోతుంది అని హింట్ ఇచ్చారు. తాజాగా చిరంజీవి విశ్వంభర సినిమా గురించి మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసారు.
ఈ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ.. మీ ముందుకు రావడానికి కారణం విశ్వంభర. చాలా మందికి డౌట్ ఉంది ఈ సినిమా ఎందుకు డిలే అవుతుంది అని. ఈ ఆలస్యం చాలా సముచితం అని నేను భావిస్తున్నాను. ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం గ్రాఫిక్స్, VFX మీదే ఆధాపడి ఉంది. ది బెస్ట్ క్వాలిటితోటి మీ ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతల ఆశయమే ఈ ఆలస్యానికి కారణం. ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా శ్రద్ధ శక్తులతో తీసుకుంటున్న సమయం ఇది.
ఇది ఒక చందమామ కథలా సాగిపోయే అద్భుతమైన కథ. ముఖ్యంగా చిన్నపిల్లలకు, మరీ ముఖ్యంగా పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలకు వాళ్ళను సైతం ఇది అలరిస్తుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే మీకు, నాకు యువీ క్రియేషన్ వాళ్ళు చిన్న గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నారు. నా పుట్టిన రోజు సందర్భంగా ఒక రోజు ముందే అంటే నేడు సాయంత్రం 6 గంటల 6 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. గ్లింప్స్ వస్తుంది, అది మనల్ని అలరిస్తుంది. ఈ సినిమాని 2026 వేసవిలో మీ ముందుకు తీసుకువస్తున్నాం. నాది భరోసా అని తెలిపారు. దేంతో నేడు సాయంత్రం రాబోయే విశ్వంభర గ్లింప్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
Also Read : Tamil Star : అల్లు అర్జున్ అట్లీ సినిమాలో తమిళ్ స్టార్.. విలన్ గానా? షూటింగ్ ఎప్పుడంటే..?