హీరోగా వి.వి.వినాయక్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు, వి.వి.వినాయక్‌ని హీరోగా లాంచ్ చేస్తున్నాడు..

  • Publish Date - May 14, 2019 / 07:50 AM IST

ప్రముఖ నిర్మాత దిల్ రాజు, వి.వి.వినాయక్‌ని హీరోగా లాంచ్ చేస్తున్నాడు..

వి.వి.వినాయక్.. మాస్ అండ్ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. అదుర్స్‌తో కామెడీని కూడా హ్యాండిల్ చెయ్యగలడని ప్రూవ్ చేసాడు. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెం:150 తర్వాత సాయి ధరమ్ తేజ్‌తో చేసిన ఇంటిలిజెంట్, వినయ్ కెరీర్‌ని డైలమాలోకి నెట్టేసింది. కట్ చేస్తే, వినాయక్ ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటి వరకు తెర వెనక యాక్షన్ చెప్పిన ఆయన త్వరలో మరొకరు యాక్షన్ చెప్తే, యాక్ట్ చెయ్యనున్నాడు. సాధారణంగా సీన్ షూట్ చేసేటప్పుడు హీరోలకు తను నటించి చూపిస్తుంటాడు వినాయక్.. చిరంజీవి ఠాగూర్, ఖైదీ నెం:150 సినిమాల్లో కాసేపు తెరపై తళుక్కుమన్నాడు.

ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా అరంగేట్రం చెయ్యబోతున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, వినయ్‌ని హీరోగా లాంచ్ చేస్తున్నాడు.  దిల్ రాజు నిర్మాతగా తీసిన మొదటి సినిమా దిల్‌కి డైరెక్టర్ వినాయకే. తనని నిర్మాతగా పరిచయం చేసిన దర్శకుడిని హీరోగా ఇంట్రడ్యూస్ చెయ్యనున్నాడు దిల్ రాజు. శరభ ఫేమ్ ఎన్. నరసింహరావు ఈ సినిమాని డైరెక్ట్ చెయ్యనున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందబోయే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.