Waltair Veerayya new poster released
Waltair Veerayya : వాల్తేరు వీరయ్య రోజురోజుకి అంచనాలు పెంచేస్తున్నాడు. ఇటీవలే పాటల చిత్రీకరణ కోసం ఫ్రాన్స్ వెళ్లిన చిత్ర యూనిట్.. అక్కడ ఒణికించే చలిలో షూటింగ్ పూర్తి చేసుకున్నారు. దీంతో సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యినట్లే. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
Waltair Veerayya : ‘నువ్వు శ్రీదేవైతే..నేను చిరంజీవి’.. సాంగ్ లీక్ చేసిన మెగాస్టార్..
సినిమా విడుదల దగ్గర పడడంతో.. మూవీకి సంబంధించిన ఏదొక అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాడు చిరు. ఈ క్రమంలోనే సినిమాలోని సెకండ్ సింగల్ ని లీక్ చేసి సందడి చేశాడు. తాజాగా ఒక కొత్త పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్. చుట్టూ కత్తులు, గన్‌లు, బాంబులు మధ్య చిరు చేతికి సంకెళ్లతో కళ్ళ జోడు పెట్టుకొని కూర్చుని మాస్ మూలవిరాట్ రూపంలో దార్శనిమిస్తున్నాడు. మాస్ స్వాగ్, వాల్తేరు వీరయ్య కలిస్తే పూనకాలే అంటూ పోస్టర్ కి కామెంట్ ఇస్తూ పోస్ట్ చేసింది చిత్ర యూనిట్.
ఈ పోస్టర్ చూసిన అభిమానులకు అయితే నిజంగానే పూనకాలు వస్తున్నాయి. పోస్టరే ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఇంకే స్థాయిలో ఉండబోతుందో అని అంచనాలు వేసుకుంటున్నారు. కాగా ఈ సినిమాలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ పాత్రకి సంబంధించిన వీడియో ప్రోమోని కూడా ఇటీవలే విడుదల చేశారు.
#WaltairVeerayya + Mass Swag = #PoonakaluLoading ?
Mega Mass Action festival begins this #Sankranthi at your nearest theatres??#WaltairVeerayyaOnJan13th pic.twitter.com/MHGTgbqPMX
— Mythri Movie Makers (@MythriOfficial) December 16, 2022