Waltair Veerayya Poonakalu Loading song release date fix
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజతో కలిసి మాస్ జాతర చేయడానికి సిద్దమవుతున్నాడు. చిరు వింటేజ్ లుక్ లో దర్శనమిస్తూ వస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ మూవీలో రవితేజ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కె బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Waltair Veerayya: ఈ సినిమా రొటీన్ ఎంటర్‌టైనర్.. హెడ్డింగ్ రాసిపెట్టుకోమంటున్న వీరయ్య!
ఇక ఇప్పటికి ఈ మూవీ నుంచి ‘బాస్ పార్టీ’, ‘చిరంజీవి-శ్రీదేవి’, ‘వీరయ్య’ సాంగ్స్ రిలీజ్ కాగా.. చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఇప్పుడు సినిమాలోని హై వోల్టేజ్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. పూనకాలు లోడింగ్ అంటూ సాగే ఈ పాటలో చిరంజీవి, రవితేజ కలిసి డాన్స్ చేయబోతున్నారు. ఇద్దరు మాస్ హీరోలు కలిసి ఒక మాస్ సాంగ్ కి డాన్స్ వేస్తే, ఎలా ఉంటాదో చూడడానికి అందరూ ఎదురు చూస్తున్నారు.
న్యూ ఇయర్ కానుకగా శుక్రవారం డిసెంబర్ 30న ఈ సాంగ్ ని విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో చిరు అండ్ రవితేజ డాన్స్ ఫోజ్ చూస్తుంటే అభిమానులకు పూనకాలు రావడం గ్యారంటీ అనిపిస్తుంది. ఈ సాంగ్ కి శేఖర్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేసినట్లు తెలుస్తుంది. గతంలో రవితేజ, చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఒక పాటలో అలా మెరిసిన సంగతి తెలిసిందే.
My two idols, My two heroes&
My two biggest strengths?Coming together to give you all Mass Poonakalu with a Mega Mass Song of the year from #WaltairVeerayya ?#PoonakaluLoading on 30th DEC ?
Megastar @KChiruTweets MassMaharaja @RaviTeja_offl @ThisIsDSP @MythriOfficial pic.twitter.com/GPhiI8lQF8
— Bobby (@dirbobby) December 29, 2022