Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ ఇటీవల వరుస అప్డేట్స్తో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయినా కూడా తమ బాస్ సినిమా నుంచి ఇలా అప్డేట్ వచ్చిందో లేదో, అలా సోషల్ మీడియాను రఫ్ఫాడించేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. బాస్ పార్టీ, చిరంజీవి శ్రీదేవి అనే రెండు సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.
Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’లో మాస్ రాజా ఎంతసేపు కనిపిస్తాడో తెలుసా..?
తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలోని మూడో సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. వీరయ్య టైటిల్ సాంగ్‌గా రాబోతున్న ఈ పాటను డిసెంబర్ 26న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ కూడా నెక్ట్స్ లెవెల్లో ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Waltair Veerayya: శ్రీదేవితో చిరంజీవి రాకకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు వస్తున్నారంటే?
రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్‌ను అందిస్తుండగా, అందాల భామ శ్రుతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. మాస్ రాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
Get ready to witness Mass Moolavirat’s Vishwaroopam ??
3rd single #VeerayyaTitleSong from #WaltairVeerayya out on 26th Dec ??#WaltairVeerayyaOnJan13th
Megastar @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/HDxnqHJpyk— Mythri Movie Makers (@MythriOfficial) December 24, 2022