Waltair Veerayya Veera Simha Reddy Ticket Prices To Hike In AP
Waltair Veerayya: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సీజన్ మొదలుకానుంది. పండగకు మరో మూడు రోజులు ఉన్నా.. టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులకు ముందాగానే పండగను పరిచయం చేయబోతున్నాయి. ఈ జాబితాలో తెలుగు స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు కూడా ఉండటంతో.. ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Waltair Veerayya : వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కేథరిన్ అందాలు..
అయితే ఈ రెండు సినిమాల విషయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మేకర్స్‌కు ఓ తీపి కబురు ఇచ్చింది. గతకొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే బడా సినిమాలు రిలీజ్ సమయంలో టికెట్ రేట్లు పెంచుతుండటంతో, ఏపీలో ఈ విధానానికి ప్రభుత్వం చెక్ పెట్టింది. టికెట్ రేట్ల పెంపును ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించడంతో, సాధారణ టికెట్ ధరలకే సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అయితే తాజాగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు మాత్రం ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకోవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది.
దీంతో ఈ రెండు సినిమాలకు గరిష్టంగా రూ.45+జీఎస్టీ వరకు ధరల పెంపు ఉండబోతుంది. సంక్రాంతి పండగ తెలుగువారికి ప్రాధాన్యమైనది కావడంతో, అటు ప్రేక్షకులతో పాటు సినిమా మేకర్స్‌కు కూడా ఈ పండగ కలిసి వచ్చేలా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు టికెట్ ధరలను పెంచుతుండటంతో మేకర్స్ మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.