×
Ad

War 2 OTT: ఓటీటీలోకి వస్తున్న వార్ 2.. రిలీజ్ డేట్ ఇదే.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

బాలీవుడ్ స్టార్ హ్రితిక్ రోషన్, మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ వార్ 2(War 2 OTT). అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.

War 2 movie to be streamed on Netflix from October 9th

War 2 OTT: బాలీవుడ్ స్టార్ హ్రితిక్ రోషన్, మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ వార్ 2. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, విడుదల తరువాత మాత్రం ఆడియన్స్ మెప్పించలేకపోయింది ఈ సినిమా. దాంతో, ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. దాదాపు రూ.500 (War 2 OTT)కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం రూ.250 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఈ ఇయర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఎన్టీఆర్, హ్రితిక్ ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్ అయ్యారు.

Rashmika Mandanna: ‘నాకు తెలుసు మీరంతా..’ ఎంగేజ్ మెంట్ తరువాత రష్మిక తొలి పోస్ట్.. క్లారిటీ ఇచ్చేసింది!

ఇదిలా ఉంటే.. తాజాగా వార్ 2 ఓటీటీ విడుదలపై ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 9వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై మాత్రం మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, థియేట్రికల్ టూ డిజిటల్ విండో ప్రకారం బాలీవుడ్ సినిమాలు 8 వారాల్లో, టాలీవుడ్ సినిమాలు 4 వారాల్లో ఓటీటీ రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం చూసుకుంటే వార్ 2 సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదల అయ్యే అవకాశం ఉంది. మరి థియేటర్స్ లో డిజాస్టర్ అయినా వార్ 2 సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.