War 2 teaser : ఎన్టీఆర్ పుట్టిన రోజున‌ వార్ 2 టీజ‌ర్‌.. హృతిక్ రోష‌న్ ట్వీట్ వైర‌ల్‌..

ఎన్టీఆర్‌, హృతిక్ రోష‌న్‌తో క‌లిసి న‌టిస్తున్న వార్ 2 మూవీ టీజ‌ర్ ఎప్పుడు విడుద‌ల కానుందంటే..

War 2 teaser release on ntr birthday Hrithik Roshan Tweet viral

ఎన్టీఆర్‌, హృతిక్ రోష‌న్‌తో క‌లిసి న‌టిస్తున్న మూవీ వార్ 2. అయాన్ ముఖర్జీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. బాలీవుడ్‌లో ఎన్టీఆర్ డెబ్యూ చిత్రం కావ‌డంతో ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండ‌నుంది ? నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తున్నాడా? అన్నది ఆస‌క్తి అంద‌రిలో ఉంది.

ఇక ఈ చిత్రం నుంచి టీజ‌ర్‌ను ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని హృతిక్ రోష‌న్ ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేశాడు. ప్ర‌స్తుతం హృతిక్ రోష‌న్ చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

Maranamass : ‘మరణమాస్’ మూవీ రివ్యూ.. మలయాళం డార్క్ కామెడీ.. బసిల్ జోసెఫ్ మళ్ళీ మెప్పించాడా?

ఈ చిత్రంలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ పీక్స్‌లో ఉంటాయని బాలీవుడ్ వర్గాల టాక్. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్తైంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సంద‌ర్భంగా ఆగ‌స్టు 15న విడుద‌ల చేసేందుకు స‌న్నాహ‌కాలు చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.