హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్.. ‘వార్’.. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో ఎంటరైంది..
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్.. ‘వార్’.. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించగా, సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన వార్ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లోనూ విడుదలైంది. మార్నింగ్ షో నుండే పాజిటివ్ టాక్ వచ్చింది.
హృతిక్, టైగర్‌ల పర్ఫార్మెన్స్, వాణీ కపూర్ గ్లామర్, యాక్షన్ సీక్వెన్సెస్ హైలెట్‌గా నిలిచాయి. రీసెంట్‌గా ‘వార్’ రూ. 100 కోట్ల క్లబ్‌లో ఎంటరైంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం..
Read Also : శకుంతలా దేవి – హ్యూమన్ కంప్యూటర్ : విద్యా కుతురిగా సాన్యా..
యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ‘ధూమ్ 3’, ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’, ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ సినిమాల తర్వాత రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టింది ‘వార్’.. హీరోలిద్దరితో పాటు దర్శకుడికీ ఫస్ట్ 3 డేస్ హైయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది.