హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్.. ‘వార్’.. ట్రైలర్ రిలీజ్..
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్.. ‘వార్’.. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా, సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రీసెంట్‌గా వార్ ట్రైలర్ రిలీజ్ చేశారు.. టీచర్ కబీర్‌గా హృతిక్, స్టూడెంట్ ఖలీద్‌గా టైగర్ ట్రైలర్‌లో వీర లెవల్లో ఇరగదీశారు.
హాలీవుడ్ మూవీ రేంజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురిచేసేలా ఉన్నాయి. విజువల్స్, ఆర్ఆర్ అదిరిపోయాయి. ఈ సినిమాలోని పోరాట ఘట్టాలను ఏడు దేశాల్లో చిత్రీకరించడం విశేషం.. అశుతోష్ రాణా, దీపానిత శర్మ, అనుప్రియ గోయెంకా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న వార్.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లోనూ విడుదల కానుంది.
Read Also : కమ్మ రాజ్యంలో కడప రెడ్లు – క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్..
మ్యూజిక్ : విశాల్ – శేఖర్, బ్యాగ్రౌండ్ స్కోర్ (ట్రైలర్) : జాన్ స్టెవార్ట్, సినిమాటోగ్రఫీ : బెంజమిన్ జాస్పర్, ఎడిటింగ్ : ఆరిఫ్ షేక్, స్టోరీ : ఆదిత్య చోప్రా, సిద్ధార్థ్ ఆనంద్, స్క్రీన్‌ప్లే : శ్రీధర్ రాఘవన్, సిద్ధార్థ్ ఆనంద్.