iBomma : ఐబొమ్మలో సినిమాలు ఎవరు పెడతారు? ఐబొమ్మలో సినిమాలు చూడటం సేఫేనా?

ఐబొమ్మలో సినిమాలు చూస్తున్నారా? దీనిని ఎవరు నడుపుతున్నారో తెలుసా? ఐబొమ్మలో సినిమాలు చూస్తే వైరస్ డౌన్‌లోడ్ అవుతుందా? చట్టపరంగా సేఫేనా? ఇలాంటి అనుమానాలు మీకు ఎప్పుడైనా వచ్చాయా? చదవండి.

iBomma

iBomma :  ఐబొమ్మ.. ఈ వెబ్ సైట్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే చాలామందికి ఈ సైట్‌లో సినిమాలు చూసిన అనుభవం ఉంటుంది. కొత్త సినిమా రిలీజ్ అవ్వగానే థియేటర్‌కి ఎందుకులే నెక్ట్స్ డే ఐబొమ్మలో చూద్దాం అనుకునేవారు ఉన్నారు. అంతగా ఈ వెబ్ సైట్ జనాల్లో నాటుకుపోయింది. ఐబొమ్మ వెబ్ సైట్ ఎవరిది? ఈ సైట్‌లో సినిమాలు ఎవరు పెడుతుంటారు? దీని వల్ల వాళ్లకు లాభం ఏంటి? ఈ సైట్‌లో సినిమాలు చూడటం నేరమా? ఈ సైట్ నుంచి సినిమాలు చూస్తే వైరస్ వచ్చే ప్రమాదం ఉందా? ఈ అనుమానాలు ఎప్పుడైనా వచ్చాయా?

Cinematograph Bill 2023 : సినిమా పైరసీ చేస్తే 3 ఏళ్ళు జైలుతో పాటు భారీ జరిమానా.. బిల్ పాస్ చేసిన రాజ్యసభ..

ఐబొమ్మ సైట్‌ను ఎవరు నడుపుతున్నారు? అనే ప్రశ్నకు ఇప్పటి వరకూ సమాధానం దొరకలేదు. వారెవరో కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే దీనిని నడిపేవారు విదేశాల్లో ఉంటారు. డొమేన్ అడ్రస్ బ్లాక్ చేసినా వెంటనే మరో డొమేన్ బుక్ చేసుకుని మరీ సినిమాలు పోస్ట్ చేస్తున్నారు. అందువల్లనే ఈ వెబ్ సైట్ నిర్వాహకులెవరో కనిపెట్టలేకపోయారు. వారిని పట్టుకోలేకపోతున్నారు. ఐబొమ్మ సైట్ వల్ల నిర్మాతలు పెద్ద ఎత్తున నష్టపోతున్న మాట వాస్తవమే. దీనిపై చర్యలు తీసుకోవాలని వారు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్లను పట్టుకోవడం ఎవరి తరం కావట్లేదు.

Bro – Baby : ఓటీటీకి వచ్చేసిన పవన్ కళ్యాణ్ ‘బ్రో’.. యూత్‌ఫుల్ లవ్ స్టోరీ ‘బేబీ’.. మరికొన్ని మూవీ రిలీజ్‌లు..

ఐబొమ్మలో సినిమాలు చూస్తే వైరస్ డౌన్ లోడ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇంకా అనేక ఇష్యూలు కూడా రావచ్చు. అయినా జనం మాత్రం థియేటర్లకు వెళ్లడం మానేసి దీనిపై ఆధారపడి సినిమాలు చూడటం మాత్రం ఆపట్లేదు. ఈ వెబ్ సైట్ రన్ చేసేవారికి ఏం లాభాలు వస్తాయి అంటారా? ఈ వెబ్ సైట్‌లో లక్షలాది మంది సినిమాలు చూస్తున్నారు. అడ్వటైజర్లు కూడా ఐబొమ్మను సెలక్ట్ చేసుకుంటున్నారు. అలా ఈ సైట్ నడిపేవారికి లాభాలు తెచ్చిపెడుతోంది. ఐబొమ్మలో సినిమాలు చూడటం చట్టరీత్యా నేరం క్రిందకే వస్తుంది. అయినా ఎవరూ లెక్క చేయకుండా ఈ ఫ్రీ సైట్‌కి అలవాటు పడిపోయారు.

ట్రెండింగ్ వార్తలు