Kailash Kher
Kailash Kher : తెలుగులో పరుగు, మిర్చి, భారత్ అనే నేను, అరవింద సమేత వీర రాఘవ వంటి మ్యూజికల్ హిట్స్ సినిమాలో పాటలు పాడిన హిందీ సింగర్ కైలాష్ ఖేర్ కి చేదు అనుభవం ఎదురైంది. స్టేజి పై పాటలు పడుతున్న సమయంలో అతని పైకి కొంతమంది వ్యక్తులు వస్తువులు విసిరేసి అతనిని అవమానపరిచారు. ప్రతి ఏడాది కర్ణాటకలో జరిగే హంపి ఉత్సవ్ లో పాల్గొనడానికి ఈ ఆదివారం (జనవరి 29) హంపీ చేరుకున్నాడు కైలాష్. పూర్వపు విజయనగర సామ్రాజ్య వారసత్వాన్ని గుర్తుచేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటుంది.
Kushi : విజయ్ అండ్ సమంత బ్యాక్ టు ‘ఖుషి’ సెట్స్.. శివ నిర్వాణ ట్వీట్!
జనవరి 27 నుంచి 29 వరకు మూడు రోజులు పాటు జరిగే ఈ ఉత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు ఈ వేడుకలో పాల్గొని ప్రదర్శనలు ఇస్తుంటారు. దీంతో వాటిని చూసేందుకు భారీ సంఖ్యలో ఈ వేడుకకు హాజరవుతారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆదివారం రాత్రి జరిగిన మ్యూజికల్ కాన్సర్ట్ లో కైలాష్ ఖేర్ పాల్గొని పాటలు ఆలపించాడు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు కైలాష్ పై వాటర్ బాటిల్ తో దాడి చేశారు. కైలాష్ అది ఏమి పట్టించుకోకుండా పాటలు పడుతూ ఉన్నాడు.
కానీ అది గమనించిన షో మేనేజర్ వెంటనే ఆ బాటిల్ వేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకోని పోలీసులకు అప్పజెప్పారు. కైలాష్ ఖేర్ కన్నడ పాటలు పడకుండా అన్ని హిందీ పాటలే పడుతుండడంతో ఆగ్రహం వచ్చి బాటిల్ విసిరేసినట్లు పోలిసులకు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. గతంలో కన్నడ పరిశ్రమలో ఒక హీరో పై చెప్పులతో దాడి చేయడం సంచలనం అయ్యింది. దీంతో ఇప్పుడు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం.
Two people have been arrested for throwing bottles on Kailash Kher during #HampiUtsav2023. They were allegedly angry as the artist was not playing #Kannada songs. #Karnataka #Vijayanagar pic.twitter.com/rrj9xsY9bv
— Imran Khan (@KeypadGuerilla) January 30, 2023