Welcoming Kriti Sanon And Sunny Singh To The Adipurush Family
Kriti Sanon – Sunny Singh: రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘ఆదిపురుష్’ షూటింగ్ స్టార్ట్ అవకముందు నుండే వరుసగా అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. సీత, లక్ష్మణుడు క్యారెక్టర్లలో ఎవరు కనిపిస్తారు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా సీత పాత్ర గురించి అయితే సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..
ఇప్పటివరకు అనుష్క శెట్టి, కృతి సనన్, కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి. కట్ చేస్తే శుక్రవారం సీత పాత్రలో కృతి సనన్ కనిపించనుందని అధికారికంగా ప్రకటించారు. లక్ష్మణుడిగా ‘సోనూ కే టిటు కి స్వీటీ’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు సన్నీ సింగ్‌ని ఎంపిక చేశారు.
ప్రభాస్, కృతి సనన్, సన్నీ సింగ్, దర్శకుడు ఓం రౌత్ కలిసి ఉన్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. శివుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ నటించనున్నారని సమాచారం. త్వరలో ‘ఆదిపురుష్’ షూటింగ్ స్టార్ట్ కానుంది.
Adipurush