Ambajipeta Marriage Band : సుహాస్ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాపై.. నాయి బ్రాహ్మణ సంఘం ఆసక్తికర వ్యాఖ్యలు..

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా చూసి ఓ ప్రెస్ మీట్ పెట్టారు.

West Godavari Nayi Brahmin Seva Sangham Interesting Comments on Ambajipeta Marriage Band Movie

Ambajipeta Marriage Band : సుహాస్(Suhas), శివాని(Shivani) జంటగా తెరకెక్కిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా ఇటీవల ఫిబ్రవరి 2న గ్రాండ్ గా రిలీజయి మంచి విజయం సాధించింది. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సంయుక్త నిర్మాణంలో దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో అదరగొడుతుంది. ఇప్పటికే మూడు రోజుల్లో ఏకంగా 8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఆల్మోస్ట్ అన్నిచోట్లా బ్రేక్ ఈవెన్ అయింది.

ఈ సినిమాలో సుహాస్, శరణ్య, నితిన్, జగదీశ్ పాత్రలకు మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా శరణ్య నటనని అంతా అభినందిస్తున్నారు. ఈ సినిమాలో సుహాస్ నాయి బ్రాహ్మణ కులంలోని వ్యక్తిగా నటించాడు. సుహాస్ తండ్రి పాత్ర, సుహాస్ కటింగ్ షాప్ నిర్వహిస్తుంటారు. అలాగే వారి వృత్తి బ్యాండ్ మేళం కూడా నిర్వహిస్తుంటారు. నాయి బ్రాహ్మణ కులాన్ని ఆధారంగా తీసుకొని మంచి సీన్స్, డైలాగ్స్ రాసుకున్నాడు దర్శకుడు. అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా చూసి ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో పలువురు నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు మాట్లాడుతూ.. అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాను మా నాయకులు, సభ్యులు అందరం కలిసి చూసాము. మా అందరికి ఈ సినిమా బాగా నచ్చింది. ఈ సినిమాలో మా నాయి బ్రాహ్మణులు సమాజంలో ఎదుర్కుంటున్న సమస్యలని చూపించారు. సినిమాని చాలా సహజంగా తెరకెక్కించారు. ఈ సినిమా చూసాక మేమంతా సంతోషిస్తున్నాం. ఇది ఒక కులానికి సంబంధించిన సినిమా కాదు, అందరూ చూడాల్సింది. ఈ సినిమాకు అవార్డులు రావాలి. మా నాయి బ్రాహ్మణులు అంతా ఈ సినిమాకు ప్రచారం చేస్తాం అని అన్నారు.

Also Read : Baby Movie : ‘బేబీ’ సినిమా రెండు భాషల్లోకి రీమేక్.. వాలెంటైన్ డేకి స్పెషల్ అప్డేట్..

నాయి బ్రాహ్మణులు ఇలా సినిమాని అభినందించడంపై చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాని గోదావరి జిల్లాల్లోనే షూట్ చేశారు. ఇప్పుడు అక్కడి నాయి బ్రాహ్మణులే అభినందించడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు