తిప్పూతుంటే నడుమే నాటీ.. నా కండ్లే చేసే కంత్రీ డ్యూటీ..

యంగ్ హీరో నితిన్, రష్మిక జంటగా నటిస్తున్న ‘భీష్మ’ (సింగిల్ ఫరెవర్).. మూవీ నుండి ‘వాట్టే బ్యూటీ’ లిరికల్ సాంగ్ రిలీజ్..

  • Publish Date - February 3, 2020 / 05:35 AM IST

యంగ్ హీరో నితిన్, రష్మిక జంటగా నటిస్తున్న ‘భీష్మ’ (సింగిల్ ఫరెవర్).. మూవీ నుండి ‘వాట్టే బ్యూటీ’ లిరికల్ సాంగ్ రిలీజ్..

యంగ్ హీరో నితిన్, వరుస విజయాలతో మంచి జోరుమీదున్న కన్నడ చిన్నది రష్మిక జంటగా.. ‘ఛలో’ మూవీతో ఆకట్టుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో.. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న బ్యూటిఫుల్ లవ్ స్టోరి ‘భీష్మ’ (సింగిల్ ఫరెవర్).. ఇటీవల విడుదల చేసిన టీజర్.. ‘వాట్టే బ్యూటీ’ వీడియో ప్రోమో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ‘వాట్టే బ్యూటీ’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. మహతి స్వర సాగర్ ట్యూన్ కంపోజ్ చేయగా, కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశారు. ధనుంజయ్, అమల చేబోలు పాడారు. జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ : ‘ఈ చిత్రం లోని ‘వాటే బ్యూటీ’ పేరుతో విడుదల అయిన గీతానికి ప్రేక్షకాభిమానులనుంచి అద్భుతమైన స్పందన లభించింది. జానీ మాస్టర్ సమకూర్చిన నృత్య రీతులు అభిమానులను అలరిస్తాయి. నితిన్, రష్మిక జంట చూడ ముచ్చటగా ఉందన్న ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇప్పటికే విడుదల అయిన ఈ చిత్రం లోని వీడియో దృశ్యాలు, సింగిల్స్ యాంధం’ గీతం వైరల్ అయ్యాయి.

Read Also : జయలలితగా కంగనా – వైరల్ అవుతున్న ‘తలైవి’ డ్యాన్స్ లుక్

అలాగే భీష్మ ప్రచార చిత్రాలకు కూడా ప్రేక్షకాభిమానులనుంచి విశేషమైన స్పందన లభిస్తోంది అన్నారు. ‘భీష్మ’ చిత్ర కధ, కధనాలు, సన్నివేశాలు, సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్‌కి కనెక్ట్ అయ్యే విధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్‌కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది’ అని తెలిపారు..

నరేష్, సంపత్, రఘుబాబు, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, వెన్నెల కిషోర్, అనంత నాగ్, శుభలేఖ సుధాకర్, జస్సెన్ గుప్త, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్, ప్రవీణ తదితరులు నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి 21న ‘భీష్మ’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘లై’, ‘ఛల్ మోహనరంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి వరుస పరాజయాల తర్వాత చేస్తున్న ‘భీష్మ’ మూవీపైనే నితిన్ ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రానికి సంగీతం : మహతి స్వర సాగర్, కెమెరా : సాయి శ్రీరామ్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : సాహి సురేష్.