Mahendragiri Varahi OTT : మహేంద్రగిరి వారాహి మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?

సుమంత్ న‌టించిన చిత్రం మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi OTT) ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది అనే విష‌యం తెలిసిపోయింది.

Which Ott Platform Will Mahendragiri Varahi Be Streaming

Mahendragiri Varahi OTT : సుమంత్ న‌టించిన చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఐశ్వర్య రాజేష్, సిద్దు జొన్నలగడ్డ, వెన్నెల కిషోర్, మీనాక్షి గోస్వామి, బ్రహ్మానందం, మంజు భార్గవి, వంశీ చాగంటి, కమల్ కామరాజు పలువురు కీలక పాత్రల్లో నటించారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నేడు సెప్టెంబర్ 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఇక ఈ చిత్రం ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది అనే విష‌యం తెలిసిపోయింది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విష‌యాన్ని చిత్ర టైటిల్ కార్డులోనే చెప్పేశారు. అయితే.. ఎప్ప‌టినుంచి స్ట్రీమింగ్ కానుంది అనే విష‌యాన్ని మాత్రం వెల్ల‌డించ‌లేదు.

Satya Sri : ప్రేమ లేఖ రాస్తున్నావా? పుస్త‌కం, పెన్నుతో స‌త్య‌శ్రీ.. ఫోటోలు వైర‌ల్‌..

ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను 10 కోట్ల‌కు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రం విడుద‌లైన నాలుగు వారాల త‌రువాతనే ఓటీటీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.