Ranabaali : రణబాలి విషయంలో విజయ్‌ దేవరకొండ అమలు చేస్తోన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్ ఎవ‌రు?

విజయ్‌ దేవరకొండ మచ్ అవెయిటెడ్‌ సినిమా రణబాలి(Ranabaali).

Who is chief guest of ranabaali pre release event

Ranabaali : విజయ్‌ దేవరకొండ మచ్ అవెయిటెడ్‌ సినిమా రణబాలి. అక్టోబర్‌ 16న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్రస్తుతం సూపర్‌ఫాస్ట్‌గా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కంప్లీట్‌ చేసుకుంటున్న ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌ అంచనాలని రెట్టింపు చేస్తుంటే.. ఈ ఆదివారం విడుదలైన కోబలి సాంగ్‌ అంతకుమించే ఉందంటున్నారు అభిమానులు.

రణబాలిగా విజయ్‌ దేవరకొండ ఫెరోషియస్ పర్ఫార్మెన్స్‌ బిగ్‌స్క్రీన్‌పై ఎక్స్‌పీరియెన్స్‌ చేసేందుకు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారంతా. రజనీకాంత్ జైలర్‌ 2 పోటీని తట్టుకునేలా రణబాలి టికెట్‌ రేట్స్ పెంచడం లేదన్న విజయ్‌.. ప్రీమియర్స్‌ లేకుండానే సినిమా రిలీజ్‌ చేస్తుండటం హాట్‌ టాపిక్‌ అవుతోంది.

Ranabaali : చరిత్రను కొత్త కోణంలో చూపించబోతున్న ‘రణబలి’!

భారీ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా రణబాలి సినిమా అక్టోబర్ 16న మార్నింగ్‌ షోలతోనే థియేటర్స్‌లోకి వస్తుందని నిర్మాత నవీన్‌ ఎర్నేని సైతం కన్ఫర్మ్‌ చేశారు. ఇది రణబాలి సినిమాకి ఎంతగానో హెల్స్‌ అవుతుందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. నో ప్రీమియర్స్‌ సహా.. సాధారణ టికెట్‌ ధరలకే విజయ్‌దేవరకొండ సినిమా థియేటర్స్‌లోకి వస్తుండటం రజనీకాంత్‌ జైలర్‌ 2 కాంపిటీషన్‌ తట్టుకోవడంలో రౌడీ హీరో మాస్టర్‌ ప్లాన్ వర్కౌటయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు ట్రేడ్‌ విశ్లేషకులు. అలాగే రణబాలి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా రౌడీ హీరో ఎవరిని ఇన్వైట్ చేస్తున్నారనే అటెన్షన్‌ అందరిలో కనిపిస్తోంది.

రణబాలి సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ అక్టోబర్ 13న ఈ మంగళవారం నిర్వహిస్తున్నట్లు అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. అయితే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మాన్‌ ఆఫ్‌ మాసెస్ ఎన్టీఆర్ వస్తారనే రూమర్స్‌కి చెక్‌ పెట్టిన నిర్మాత.. ముఖ్యఅతిథి ఎవరన్నది త్వరలోనే క్లారిటీ ఇస్తామన్నారు. మొత్తంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ జైలర్ 2తో పోటీ విషయంలో విజయ్‌ దేవరకొండకి టికెట్‌ ధరల విషయంలో కాంప్రమైజ్‌ కావడం కలిసొచ్చే అంశంగా తెలుస్తోంది. మరి అక్టోబర్ 16న రణబాలిగా వస్తోన్న విజయ్‌ దేవరకొండ.. దసర బరిలో ఏ రేంజ్‌ సక్సెస్‌ అందుకుంటారో వెయిట్‌ అండ్‌ సీ.