ఎవరీ గంగూబాయి? సినిమాను తలపించే ఆమె జీవితమేంటో తెలుసా!

గంగూబాయి ఖథియావాడి జీవితంలోని జరిగిన ఊహించని సంఘటనలు ఆమెను ‘మేడమ్ ఆఫ్ కామతిపుర’గా ఎలా మార్చాయి?

  • Publish Date - January 15, 2020 / 11:36 AM IST

గంగూబాయి ఖథియావాడి జీవితంలోని జరిగిన ఊహించని సంఘటనలు ఆమెను ‘మేడమ్ ఆఫ్ కామతిపుర’గా ఎలా మార్చాయి?

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భనాల్సీ దర్శకత్వంలో ఆలియా భట్ తొలిసారి నటిస్తున్న సినిమా.. ‘గంగూబాయి ఖథియావాడి’.. (మాఫియా క్వీన్). 
 బుధవారం ఈ సినిమాలోని ఆలియా ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. ఈ పోస్టర్లలో పవర్‌ఫుల్‌ స్టన్నింగ్‌ లుక్‌తో ఆలియా అదరగొట్టేసింది.
యంగర్‌లుక్‌తో పాటు.. నుదుటను పెద్ద తిలకం ధరించి.. ముక్కుపుడకతో గంభీరంగా చూస్తున్న లుక్‌ కూడా ఆకట్టుకుంటోంది.

ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ హుస్సైన్‌ జెదీ, గంగూబాయి జీవితం ఆధారంగా ‘మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై’ అనే పుస్తకం రచించగా అత్యధిక కాపీలు అమ్ముడైన పుస్తకంగా రికార్డు క్రియేట్ చేసింది. అసలు ఎవరీ గంగూభాయి.. సినిమాను తలపించేలా ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి.. ఏ పరిస్థితులు ఆమె జీవితాన్ని అంతలా ప్రభావితం చేశాయి.. అనేది ఓసారి చూద్దాం..

‘గంగూబాయి ఖథియావాడి’.. ‘మేడమ్ ఆఫ్ కామతిపుర’ గా పిలవబడడం వెనుక, 1960 కాలంలో ముంబైలో అత్యంత శక్తివంతమైన మహిళగా ఎదగడం వెనుక, ముంబై అండర్‌వరల్డ్‌తో సంబంధాలు ఏర్పడడం వెనుక సినిమాను తలపించే పలు ట్విస్ట్‌లు ఉన్నాయి.
గంగూబాయి.. అండర్‌వరల్డ్‌ సహాయంతో ముంబైలోని కామతిపూరలో పలు వేశ్యాగృహాలు నడపడంతో ప్రాచుర్యం పొందింది. దీంతో ఆమెకు ‘మేడమ్ ఆఫ్ కామతిపుర’ అనే పేరు వచ్చింది. అసలు గంగూబాయి ఇలాంటి ఉచ్చులో చిక్కుకోవడానికి ప్రధాన కారణం.. తెలియని వయసు.. యంగ్ ఏజ్‌లో గుడ్డిగా నమ్మి తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఇంట్లో నుండి పారిపోయింది గంగూబాయి. ఆమె అయామకత్వాన్ని అలుసుగా తీసుకున్న ఆమె ప్రియుడు, గంగూబాయిని ట్రాప్ చేసి కామతిపురలోని ఓ వేశ్యాగృహంలో అమ్మేశాడు.


తన జీవితంలో ఇటువంటి పరిస్థితి వస్తుందని, ఊహించని ఈ సంఘటన తన జీవితాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అనేది బహుశా అప్పుడు గంగూబాయికి కూడా తెలిసుండదేమో. మెల్లగా ఆ వృత్తిపై పట్టు సాధించి, ముంబై అండర్‌వరల్డ్‌ సహాయంతో సొంతంగా తనే వేశ్యాగృహాలు నడుపుతూ ‘మేడమ్ ఆఫ్ కామతిపుర’ గా ఎదిగింది. అంతేకాదు.. సెక్స్ వర్కర్ల హక్కుల కోసం కూడా ఆమె పోరాడింది.
తన సొంత అనుభవం కారణంగా, గంగూబాయికి సమాజంలోని ఇతర మహిళల పట్ల ఓ అవగాహన ఏర్పడింది. తెలిసి తెలిసి తనలా ఎవరూ కాకూడదని సెక్స్ వర్కర్ల హక్కులను వారి సాధికారతను సాధించడానికి ఆమె తన శక్తిని, పలుకుబడిని ఉపయోగించుకుంది. సెక్స్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి ఆమె అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను సంప్రదించినట్లు సమాచారం.


కామతిపురలో జీవన పరిస్థితులను మెరుగుపర్చడానికి ఆమె చేసిన ప్రయత్నాల కారణంగా అక్కడి ప్రజలు మరియు సమాజంలో గంగూబాయి పట్ల ఓ గౌరవం ఏర్పడింది.
ఆమె విగ్రహాలు మరియు ఫ్రేమ్డ్ ఛాయాచిత్రాలు ఈ ప్రాంతంలోని ఇళ్లలో కనిపించేవి.. స్థానికులు ఆమె గౌరవార్థం స్థానికంగా ఒక విగ్రహాన్ని కూడా నిర్మించారు.
గంగూబాయి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘గంగూబాయి ఖథియావాడి’ చిత్రంలో గంగూబాయి క్యారెక్టర్ చేయడం తన నట జీవితంలో మర్చిపోలేని సంఘటన అని అలియా భట్ ఆశాభావం వ్యక్తం చేసింది. సంజయ్ లీలా భన్సాలీ, జయంతిలాల్ గడా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా 2020 సెప్టెంబర్ 11న విడుదల కానుంది.

ట్రెండింగ్ వార్తలు