×
Ad

Pawan-Balayya: పవన్ కళ్యాణ్ vs బాలకృష్ణ.. తప్పుకున్నా.. ఫ్యాన్స్ ఒప్పుకోవడం లేదు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-నందమూరి బాలకృష్ణ.(Pawan-Balayya) వీరిద్దరూ రాజకీయాల్లో ఒకే కూటమిలో ఉండవచ్చు. కానీ, సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆ పోటీ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది.

Who will win the competition between og and Akhanda 2?

Pawan-Balayya: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-నందమూరి బాలకృష్ణ. వీరిద్దరూ రాజకీయాల్లో ఒకే కూటమిలో ఉండవచ్చు. కానీ, సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆ పోటీ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. నిజానికి ఈ ఇద్దరు హీరోల మధ్య ఆ ఆలోచన లేకపోయినా ఈ హీరోల ఫ్యాన్స్ (Pawan-Balayya)మధ్య మాత్రం ఒక రేంజ్ లో నువ్వా నేనా అన్న రేంజ్ లో వార్ నడుస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య మరో సోషల్ మీడియా వార్ మొదలయ్యింది. అదేంటంటే. పవన్ ఓజీ సినిమా, బాలయ్య అఖండ 2 సినిమా రెండు ఒకేరోజున(సెప్టెంబర్ 25) విడుదల అవ్వాలి. ఫ్యాన్స్ కూడా ఈ పోటీని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఏ హీరో ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుంది అని.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9లో క్యూట్ మూమెంట్.. తనూజకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్.. తనూజ ఏమందో తెలుసా?

సోషల్ మీడియా వేదికగా దారుణంగా కామెంట్స్ కూడా చేసుకున్నారు. కానీ, అనోహ్యంగా ఆ పోటీ నుంచి బాలకృష్ణ తప్పుకున్నాడు. షూటింగ్ పూర్తి కాని నేపధ్యంలో అఖండ 2ని వాయిదా వేస్తూ మేకర్స్ ప్రకటన చేశారు. దీంతో, బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన పోరు ఉండబోతుంది అనుకున్న ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింగి. అలా సింగిల్ గా వచ్చిన ఓజీ రికార్డుల దుమ్ముదులిపింది. కలెక్షన్స్ సునామి సృష్టించింది. కేవలం, 11 రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు, ఓజీ బ్లాక్ బస్టర్ సాధించింది ఇప్పుడు అఖండ 2 టైం స్టార్ట్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి.

సినిమా వాయిదా పడింది కానీ, పోటీ నుంచి కాదు. అంటూ రెచ్చిపోతున్నారు. అఖండ 2 సినిమా డిసెంబర్ 5న భారీ స్థాయిలో విడుదల కానుంది. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. డివోషనల్ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు బోయపాటి శ్శ్రీను. మొదటి పార్ట్ కి మించి ఈ సినిమా ఉండబోతుంది అని టీజర్ తోనే అర్థమయ్యింది. కాబట్టి, ఈ సినిమా కూడా భారీ విజయాన్నీ సాధించి అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కాబట్టి, చిన్న పాజిటీవ్ టాక్ వచ్చినా ఈ నార్త్ లో ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ఓజీ కుమ్మేశాడు, మరి అఖండ 2 పరిస్థితి ఏంటో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ పోరులో చివరికి గెలుపు ఎవరిదీ అనేది చూడాలి.