Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9లో క్యూట్ మూమెంట్.. తనూజకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్.. తనూజ ఏమందో తెలుసా?
బిగ్ బాస్ హౌస్ అంటేనే అన్ని ఎమోషన్స్ కలయిక. అందులో ప్రేమ అనే (Bigg Boss 9 Telugu)అందమైన ఎమోషన్ కూడా ఒకటి. ప్రతీ సీజన్ లో ఎదో ఒక జంట ఆ ఫీలింగ్ ని ఫీలవడం జరుగుతూనే ఉంటుంది.

Pawan proposed to Tanuja in Bigg Boss Telugu Season 9
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హౌస్ అంటేనే అన్ని ఎమోషన్స్ కలయిక. అందులో ప్రేమ అనే అందమైన ఎమోషన్ కూడా ఒకటి. ప్రతీ సీజన్ లో ఎదో ఒక జంట ఆ ఫీలింగ్ ని ఫీలవడం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో కూడా అలాంటి ఎమోషన్ ఇద్దరి మధ్య క్రియేట్ అయ్యింది. ఆ ఇద్దరు మరెవరో కాదు తనూజ-పవన్ కళ్యాణ్. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి కళ్యాణ్ తనూజపై ప్రత్యేకమైన ఎమోషన్ ని చూపిస్తూనే ఉన్నాడు(Bigg Boss 9 Telugu). వీలున్నప్పుడు ఆ ఫీలింగ్ చెప్పడానికి కూడా ట్రై చేశాడు. ఆ విషయం హౌస్ లో ఉన్నవారికి మాత్రమే కాదు చూస్తున్న షో చూస్తున్న ప్రేక్షకులకు కూడా క్లియర్ గా అర్థమయ్యింది.
ఆ విషయం తనూజకి కూడా అర్థం అయ్యింది. కానీ, ఎక్కడ కూడా ఆమె ఓపెన్ అవలేదు. సింపుల్ గా అవాయిడ్ చేస్తూ వచ్చింది. ఇమ్మాన్యుయేల్ తో సరదాగా ఉంటూ వచ్చింది. అయితే, తనూజపై ఉన్న ఫీలింగ్స్ ని ఆపుకోలేకపోయిన పవన్ ఓపెన్ అయిపోయాడు. తన ఫీలింగ్ ఓపెన్ గానే తనూజ ముందు ఎక్సప్రెస్ చేశాడు. బుధవారం నాటి ఎపిసోడ్ లో ఈ క్యూట్ మూమెంట్ జరిగింది. టాస్క్ లో భాగంగా కాసేపు తనూజతో డిస్కషన్ పెట్టిన పవన్.. “ఏదైనా ఛాన్స్ ఉందా. నాలాంటివాడు అయితే నీకు ఓకేనా? అంటూ చాలా ఎమోషనల్ గా ప్రపోజ్ చేశాడు.
దానికి తనూజ స్పందిస్తూ.. “ఇందుకే నిన్ను పిల్లాడు అనేది అంటూ నవ్వింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూల్, కామ్‌గా డీల్ చేసేవాడు. ఒకరు వంద మాటలు మాట్లాడినా ఒకే మాటలో ఆ టాపిక్‌ని తెగ్గొట్టే సత్తా, అన్నింటికన్నా నా మైండ్ సెట్‌కి మ్యాచ్ అయ్యే వ్యక్తిని నేను ఇష్టపడతాను” అంటూ తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పింది తనూజ. దాంతో, విషయం అర్థమైన కల్యాణ్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు. ఈ క్యూట్ మూమెంట్ ని పక్కనే ఉండి చూస్తున్న రీతూ చౌదరి, ఇమ్మాన్యుయేల్ కౌంటర్స్ వేస్తూ నవ్వుకున్నారు. అలా తనూజ-కళ్యాణ్ మధ్య జరిగిన ఈ ప్రపోజల్ సీన్ ఎపిసోడ్ కి హైలెట్ గా నిలిచింది.