“గేమ్ ఛేంజర్‌” అసలు బాధితుడు రామ్ చరణ్.. శిరీష్ కామెంట్స్‌పై దిల్‌రాజు క్లారిటీ

ఈ మొత్తం ప్రక్రియలో అసలైన బాధితుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణే అని సామాజిక మాధ్యమాల్లో చాలా మంది అంటున్నారు.

Ram Charan

గేమ్ ఛేంజర్‌ విషయంలో అసలు బాధితుడు రామ్ చరణ్ అని నిర్మాత దిల్‌ రాజు అన్నారు. గేమ్ ఛేంజర్ ఫ్లాప్ తర్వాత హీరో రామ్‌ చరణ్ గానీ, డైరెక్టర్ శంకర్ గానీ కనీసం తమకు ఫోన్ చేసి “ఏంటి పరిస్థితి” అని అడగలేదంటూ శిరీష్ చేసిన కామెంట్ల మీద దిల్‌ రాజు స్పందించారు. 10టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్‌ రాజు గేమ్ ఛేంజర్‌తో పాటు మరికొన్ని అంశాలపై మాట్లాడారు.

“గేమ్ ఛేంజర్‌ సినిమాతో ఫస్ట్‌ నుంచి నేనే ట్రావెల్ అయ్యాను. శిరీష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను చూసుకున్నాడు. గేమ్ ఛేంజర్ స్టార్ట్‌ చేసిన తర్వాత మధ్యలో సడెన్‌గా శంకర్ ఇండియన్ 2 చేయాల్సి వచ్చింది. ఆ టైమ్‌లో వేరే స్టోరీ ఏదైనా ఉంటే స్టార్ట్‌ చేసుకోవాలని రామ్ చరణ్‌కు సూచించాను. కానీ, రామ్ చరణ్ మాత్రం కమిటెడ్‌గా ఈ సినిమా మీదే దృష్టి పెట్టాడు” అని దిల్‌ రాజు అన్నారు.

“లాస్ట్ 10 డేస్ నుంచి ఒక్క ఇంటర్వ్యూలో కూడా గేమ్ చేంజర్ అంశం లేకుండా ఇంటర్వ్యూ జరగట్లేదు. ప్రతి ఒక్క దాంట్లో నేను అదే చెప్పుకుంటూ వచ్చాను. నేను రామచరణ్, శంకర్ తో క్లోజ్ గా ట్రావెల్ అయ్యాను. ఆ సినిమా అంతా నేనే ట్రావెల్ అయ్యాను. శిరీష్ ఆ సినిమాలో ఇన్వాల్వ్ లేదు. సంక్రాంతికి వస్తున్నాం మొత్తం శిరీష్ ట్రావెల్ అయ్యారు.

ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా గురించి నేను అన్ని చెప్పుకుంటూ వస్తున్నాను. ఏంటి? ఎలా జరిగింది? ఆ ప్రాసెస్ ఏంటి అనేది చెబుతున్నాను. ఇండియన్ 2 రావడం వల్ల శంకర్ ఇండియన్ 2ని రీఓపెన్ చేసినప్పుడు రామచరణ్ తో నాకు జరిగిన డిస్కషన్‌లో కూడా చెప్పాను. చరణ్ వేరే స్క్రిప్ట్ ఉంటే కూడా ఏదైనా స్టార్ట్ చేయాలని అన్నాను.

అయితే, మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకుండా ఈ సినిమా కోసమే టైం ఇచ్చారు. కాబట్టి నాకు ఒక కన్సర్న్ ఉంటుంది. అరే నా హీరోని కూడా నేను కూర్చోపెడుతున్నాను అన్న కన్సర్న్ ఉంటది. శంకర్ వెళ్లి ఇండియన్ 2 చేసుకుంటున్నారు.. నేను గేమ్ చేంజర్ తో పాటు ఇతర ఏదో వర్క్ చేస్తున్నాను. రామ్ చరణ్ ఓన్లీ వన్ ఫిలిమ్ చేస్తున్నారు.

బిగ్ డైరెక్టర్ తో పని చేయడం వల్ల మాకు ఆ ఆక్సెస్ లేకపోవడం వల్ల, కొన్ని ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. టైం షెడ్యూల్ ప్లానింగ్.. వంటివి వన్ టు వన్ కూర్చొని మాట్లాడుకునే ఛాన్స్ లేకపోవడం వల్ల డిలేలు జరుగుతూ వచ్చాయి” అని అన్నారు.

గేమ్ ఛేంజర్‌ నుంచి ఏమైనా పాఠాలు నేర్చుకున్నారా? అన్న ప్రశ్నకు దిల్‌ రాజు స్పందించారు. “2024లో ఫ్యామిలీ స్టార్ తీశాం. అది ఓ డైరెక్టర్ ఫిలిమ్. ఆ కథలో ఉన్న లోపాలు మాకు ముందే తెలిసినా, డైరెక్టర్‌తో సంభాషణలు జరిగినా 100 శాతం రీచ్ చేయలేకపోయాం. అలాగే, గేమ్‌ ఛేంజర్‌కు కూడా అలాంటి ఫలితమే వచ్చింది.

నేను ఎప్పుడు డైరెక్టర్, హీరోపై కామెంట్ చేయను. దాని తర్వాత వచ్చిన సంక్రాంతి వస్తున్నాం కూడా డైరెక్టర్ ఫిలిమ్. తమ్ముడు కూడా డైరెక్టర్ ఫిలిమ్. సక్సెస్ అనేది డైరెక్టర్లు అనుకున్నది అనుకున్నట్లు రిజల్ట్స్‌ తెచ్చినప్పుడే రీచ్ అవుతుంది. ఇక్కడ దిల్‌ రాజు అనే ఒక బ్రాండ్, ఇన్వాల్‌మెంట్ మా సంస్థకు పనిచేస్తాయి. అవి మిస్ అవుతున్నాం. తదుపరి అది మిస్ కాకుండా చూసుకుంటాం” అని దిల్ రాజు అన్నారు.

మరోవైపు, శిరీష్ కామెంట్లపై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ రిలీజ్ చేసిన ఓపెన్ లెటర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ లెటర్ ఇదే..