డ్రగ్స్ తీసుకున్న కంగనను వదిలేశారెందుకు?.. నగ్మ సంచలన వ్యాఖ్యలు..

  • Publish Date - September 24, 2020 / 02:42 PM IST

Bollywood Drugs Case – Nagma, Kangana Ranaut: యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు అనేక మలుపులు తిరిగి డ్రగ్స్ వ్యవహారం దగ్గర ఆగింది. దీంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) రంగంలోకి దిగి వేగంగా దర్యాప్తు చేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌కు ఎన్‌సీబీ తాజాగా సమన్లు అందించింది.

రకుల్, దీపికలను శుక్రవారం, శ్రద్ధా, సారాలను శనివారం విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. ఇదిలా ఉంటే తాజాగా సీనియర్ నటి, కాంగ్రెస్ నేత నగ్మ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ విషయంలో సంచలన ఆరోపణలు చేశారు.


గతంలో డ్రగ్స్ తీసుకున్నట్టు స్వయంగా వెల్లడించిన కంగనా రనౌత్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూర్ (ఎన్‌సీబీ) ఎందుకు సమన్లు పంపించలేదని నగ్మ ప్రశ్నించారు.

‘గతంలో తాను డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించిన కంగనా రనౌత్‌కు ఎన్‌సీబీ ఎందుకు సమన్లు పంపలేదు. వాట్సాప్ చాటింగ్ ఆధారంగానే మిగిలిన హీరోయిన్లను పిలిచారు కదా! మరి, తాను డ్రగ్స్ తీసుకున్నట్లు స్వయంగా వెల్లడించిన కంగనను ఎందుకు పిలవలేదు? అయినా టాప్ హీరోయిన్స్‌‌కు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు లీక్ చేసి వారి ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడమే ఎన్‌సీబీ పనా?.. అని నగ్మ ప్రశ్నించారు. మరి నగ్మ వ్యాఖ్యలపై కంగన ఎలా స్పందిస్తుందో చూడాలి.