Ori Devuda : ఓరి దేవుడా ప్రమోషన్స్‌కి వెంకటేష్ ఎందుకు రాలేదు?

సినిమాకి సంబంధించిన ఏ ప్రమోషన్ లో కూడా వెంకటేష్ పాల్గొనకపోవడం ఆశ్చర్యం. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చాడు. దీనికి కూడా వెంకటేష్ రాకపోవడంతో పలు అనుమానాలు తలెత్తాయి. దివాళీ దావత్ ఈవెంట్ కి మాత్రం........

why venkatesh not came to ori devuda movie pramotions

Ori Devuda :  విశ్వక్‌సేన్ హీరోగా, వెంకటేశ్‌ గెస్ట్ అప్పీరెన్స్ లో, ఆశాభట్, మిథిలా పాల్కర్‌ హీరోయిన్స్‌గా అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఓరి దేవుడా. తమిళ్ సినిమా ఓ మై కడువలే సినిమాకి ఇది రీమేక్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి ఈ సినిమాని నిర్మించారు. ఓరి దేవుడా ప్రమోషన్స్ ని భారీగా చేశారు.

సాధారణంగానే విశ్వక్‌సేన్ తన సినిమాలకి ప్రమోషన్స్ ని భారీగా చేస్తాడు. ఈ సారి ఆ డోస్ మరింత పెంచి వీర లెవల్లో ప్రమోషన్స్ చేశాడు. ఇంటర్వ్యూలు, టూర్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, యువ హీరోలందర్నీ పిలిచి దివాళీ దావత్ ఈవెంట్, మీమర్స్ పార్టీ.. ఇలా చాలా రకాలుగా ప్రమోషన్స్ చేశాడు విశ్వక్‌సేన్. అయితే ఈ సినిమాలో వెంకటేష్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నారు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

అయితే సినిమాకి సంబంధించిన ఏ ప్రమోషన్ లో కూడా వెంకటేష్ పాల్గొనకపోవడం ఆశ్చర్యం. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చాడు. దీనికి కూడా వెంకటేష్ రాకపోవడంతో పలు అనుమానాలు తలెత్తాయి. దివాళీ దావత్ ఈవెంట్ కి మాత్రం ఓ వీడియో మెసేజ్ ని పంపించారు వెంకటేష్. ముఖ్యమైన పాత్రలో నటించిన వెంకటేష్ కనీసం ఒక్కసారి కూడా ప్రమోషన్ లో పాల్గొనకపోవడంతో అందరూ విశ్వక్‌సేన్ ని ప్రశ్నిస్తున్నారు.

Manchu Vishnu : సినిమా రిలీజ్ కాకుండానే జిన్నాపై నెగిటివ్ రివ్యూలు.. ఆ ఛానల్స్ ఇకపై ఉండవు.. మంచు విష్ణు వార్నింగ్..

తాజాగా విశ్వక్‌సేన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ”వెంకటేష్ గారితో కలిసి పని చేయడం నా లైఫ్ లో ఊహించని సర్‌ప్రైజ్‌. నా అదృష్టం కూడా. సల్మాన్‌ఖాన్‌ గారి సినిమాతో వెంకటేశ్‌ గారు బిజీగా ఉన్నారు. షూటింగ్ లో ఉండటం వల్లే ఓరి దేవుడా ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయారు. అంతకు మించి ఇంకేమి లేదు. మా గురించి సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేశారు ఆయన. వెంకటేష్ గారి సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుంది” అని తెలిపారు. మరి నేడు రిలీజ్ అయ్యే ఈ ఓరి దేవుడా సినిమా ఫలితం ఎలా ఉండబోతోందో చూడాలి.