Manchu Vishnu : సినిమా రిలీజ్ కాకుండానే జిన్నాపై నెగిటివ్ రివ్యూలు.. ఆ ఛానల్స్ ఇకపై ఉండవు.. మంచు విష్ణు వార్నింగ్..
సినిమా ప్రమోషన్స్ లో ఇప్పటికే చాలా సార్లు తనని ట్రోల్ చేస్తున్న వారిపై విరుచుకుపడ్డాడు మంచు విష్ణు. కొంతమందికి పబ్లిక్ గా వార్నింగ్ కూడా ఇచ్చాడు. తనని, తన సినిమాలని కొంతమంది కావాలని.................

Manchu Vishnu gave warning to some youtube channels who gives negitiv reviews on Ginna
Manchu Vishnu : మంచు విష్ణు హీరోగా సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ కథానాయికలుగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో చేసిన సినిమా జిన్నా. దీపావళి కానుకగా నేడు అక్టోబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది. మంచు విష్ణు చాలా రోజుల తర్వాత థియేటర్లో కనిపించనున్నాడు. గత కొంతకాలంగా మంచు విష్ణు మీద ట్రోలింగ్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నాడు మంచు విష్ణు. సినిమాలో సన్నీ లియోన్ ని పెట్టడం, ప్రమోషన్స్ డిఫరెంట్ గా చేయడంతో సినిమాపై అంచనాలని నెలకొల్పాడు.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇప్పటికే చాలా సార్లు తనని ట్రోల్ చేస్తున్న వారిపై విరుచుకుపడ్డాడు మంచు విష్ణు. కొంతమందికి పబ్లిక్ గా వార్నింగ్ కూడా ఇచ్చాడు. తనని, తన సినిమాలని కొంతమంది కావాలని నెగిటివ్ చేస్తున్నాడని ఆరోపించాడు. తాజాగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సినిమా రిలీజ్ కాకుండానే నా సినిమాపై నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారని ఆరోపించాడు మంచు విష్ణు.
తన ట్విట్టర్ అకౌంట్ లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పేర్లని, వాటి ఛానల్ లింక్స్ ని షేర్ చేసి..”నేను అనుకున్నదే జరిగింది. ఇదిగో కొంతమంది పెయిడ్ బ్యాచ్ లని మీ ముందుకి తీసుకువచ్చాను. జిన్నా సినిమా ఇంకా రిలీజ్ అవ్వనేలేదు, వీళ్ళు అప్పుడే నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎందుకింత ద్వేషం. త్వరలో మేము ఆ ఛానల్స్ ని మూయించేస్తాను. ఇది వాళ్ళు తెలుసుకుంటారని అనుకుంటున్నాను” అని సైలెంట్ వార్నింగ్ ఇచ్చాడు మంచు విష్ణు. మరి ఇవాళ రిలీజ్ అయ్యే జిన్నా సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.
As expected. I am calling out the ‘paid batch’. GINNA hasn’t released and these guys have started giving negative reviews. Why so much hatred???? ?. I hope they realize that we will shut their channels down soon. pic.twitter.com/6FJ1xV4vaj
— Vishnu Manchu (@iVishnuManchu) October 20, 2022