Michael : సిక్స్ ప్యాక్ సూపర్ యాక్షన్‌తో పాన్ ఇండియా సినిమాతో వస్తున్న సుందీప్ కిషన్.. మైఖేల్ టీజర్ రిలీజ్

టీజర్ చూస్తుంటే ఫుల్ మాస్, యాక్షన్ సినిమాలా కనిపిస్తుంది. టీజర్ మొత్తం ఫుల్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. సందీప్‌ కిషన్ మొదటిసారి పూర్తిగా యాక్షన్ సినిమా చేస్తున్నాడు. టీజర్ లో...........

Michael : సిక్స్ ప్యాక్ సూపర్ యాక్షన్‌తో పాన్ ఇండియా సినిమాతో వస్తున్న సుందీప్ కిషన్.. మైఖేల్ టీజర్ రిలీజ్

Sundeep Kishan Michael Teaser released

 

Michael :  సందీప్‌ కిషన్‌ హీరోగా, దివ్యాంశా కౌశిక్‌ హీరోయిన్‌ గా, విజయ్‌ సేతుపతి, గౌతమ వాసుదేవ్ మీనన్, వరుణ్ సందేశ్, అనసూయ, వరలక్ష్మి శరత్ కుమార్.. పలువురు ముఖ్య పాత్రల్లో రంజిత్‌ జయకొడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మైఖేల్‌’. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు.

ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ మాస్, యాక్షన్ సినిమాలా కనిపిస్తుంది. టీజర్ మొత్తం ఫుల్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. సందీప్‌ కిషన్ మొదటిసారి పూర్తిగా యాక్షన్ సినిమా చేస్తున్నాడు. టీజర్ లో సినిమాలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అందర్నీ చూపించాడు. టీజర్ చివర్లో.. మన్నించేటప్పుడు దేవుడవుతాము మైఖేల్.. అంటే సుందీప్ కిషన్.. నేను మనిషిగానే ఉంటాను మాస్టార్, దేవుడవ్వాలనే ఆశ లేదు అని చెప్పడం టీజర్ పై ఆసక్తి కలిగిస్తుంది.

BiggBoss 6 Day 46 : హౌజ్‌లో శ్రీహాన్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫిజికల్ టాస్క్‌లో కొట్టుకున్న రెండు టీమ్స్

టీజర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించగా సందీప్‌ కిషన్‌ ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ”నాకు నేను పెట్టుకున్న పెద్ద పరీక్ష మైఖేల్. ఈ సినిమా కోసం నేను మూడు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను. ఈ సినిమా కోసం దాదాపు 24 కిలోలు బరువు తగ్గాను. ఇటీవల మంచి కంటెంట్ సినిమాలు వస్తే తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ సినిమాని అన్ని భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నాం. తెలుగు ఇండస్ట్రీ కాలర్ ఎగరేసుకునే సమయం ఇది” అని తెలిపారు. మైఖేల్ సినిమా మీద అంచనాలు చాలానే ఉన్నాయి. గత కొంతకాలంగా ఫ్లాప్స్ లో ఉన్న సందీప్ కిషన్ కి ఈ సినిమా మరి ఏ రేంజ్ హిట్ అవుతుంది చూడాలి.