BiggBoss 6 Day 46 : హౌజ్‌లో శ్రీహాన్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫిజికల్ టాస్క్‌లో కొట్టుకున్న రెండు టీమ్స్

బిగ్‌బాస్‌ బుధవారం ఎపిసోడ్ లో ఫుడ్ కోసం రెండు టీమ్స్ పోరాడిన సంగతి తెలిసిందే. గెలిచిన టీమ్స్ కి కొంచెం ఫుడ్ ఇచ్చి కంటెస్టెంట్స్ ని వదిలేసాడు. దీంతో కంటెస్టెంట్స్ ఆకలితో పడుకున్నారు. రోజూ పాటలతో లేపే బిగ్‌బాస్‌ గురువారం ఎపిసోడ్ లో కుక్క అరుపులు ప్లే చేసి...........

BiggBoss 6 Day 46 : హౌజ్‌లో శ్రీహాన్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫిజికల్ టాస్క్‌లో కొట్టుకున్న రెండు టీమ్స్

BiggBoss 6 Day 46 sreehan birthday celebrations and physical tasks

 

BiggBoss 6 Day 46 :  బిగ్‌బాస్‌ బుధవారం ఎపిసోడ్ లో ఫుడ్ కోసం రెండు టీమ్స్ పోరాడిన సంగతి తెలిసిందే. గెలిచిన టీమ్స్ కి కొంచెం ఫుడ్ ఇచ్చి కంటెస్టెంట్స్ ని వదిలేసాడు. దీంతో కంటెస్టెంట్స్ ఆకలితో పడుకున్నారు. రోజూ పాటలతో లేపే బిగ్‌బాస్‌ గురువారం ఎపిసోడ్ లో కుక్క అరుపులు ప్లే చేసి కంటెస్టెంట్స్ ని లేపాడు. బిగ్‌బాస్‌ కనికరించి కంటెస్టెంట్స్ కి ఫుడ్ ని పంపించాడు. ఆ తర్వాత హౌజ్ లో ఇకపై బాగా ఆడతామని కంటెస్టెంట్స్ ప్రతిజ్ఞ చేయాలని సూచించాడు. దీంతో కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు తమదైన పద్దతిలో హౌజ్ లో బాగా ఆడతామని, ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఇక గురువారం శ్రీహన్ పుట్టిన రోజు కావడంతో ఇంటి సభ్యులంతా కలిసి కేక్ ని తయారు చేసి శ్రీహన్ చేత కేక్ కట్ చేయించారు. మొన్నటిదాకా గొడవపడిన ఇనయా, శ్రీహాన్ లు కలిసిపోవడంతో ఇంటి సభ్యులంతా కలిసి వారిని ఆటపట్టించారు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇంట్లో ఉండేందుకు పోటీ పడాలని కొత్త టాస్కులు ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఫుడ్ కోసం డివైడ్స్ చేసిన రెండు టీమ్స్ ని అలాగే ఉంచి మరో కొత్త టాస్క్ ఇచ్చాడు.

ఈ టాస్క్ ప్రకారం ఒక మెషిన్ లో నుంచి బొమ్మలు, పూలు వస్తాయి. రెండు టీమ్స్ ఆ బొమ్మలు, పూలని కలెక్ట్ చేసి వారికి ఇచ్చిన ప్లేసెస్ లో పెట్టాలి. దీంతో రెండు టీమ్స్ మెషిన్ దగ్గరే ఉండి పోటీ పడ్డాయి. బొమ్మలు, పూలు వస్తుండగానే లాక్కోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరిగాయి. శ్రీహన్, అర్జున్ కళ్యాణ్ మధ్య గొడవ జరగడంతో అర్జున్ కళ్యాణ్.. శ్రీహాన్ ని మెషిన్ నుంచి లాగేశాడు, దీంతో శ్రీహన్ కూడా అలాగే చేయడంతో ఇద్దరూ కొట్టుకునేదాకా వెళ్లారు. శ్రీహాన్ తొడ కొట్టి దమ్ముంటే రా చూసుకుందాం అని అర్జున్ ని రెచ్చగొట్టాడు.

BiggBoss 6 Day 45 : బిగ్‌బాస్‌లో దొంగలు పడ్డారు.. బిగ్‌బాస్ కోపానికి ఆకలితో అలమటించిన కంటెస్టెంట్స్

రేవంత్ కి, శ్రీ సత్యకి మధ్య గొడవ జరిగింది. శ్రీహాన్ నుంచి బొమ్మ లాక్కునే క్రమంలో శ్రీ సత్య కింద పడింది. దీంతో రెండు టీమ్స్ గొడవపడ్డాయి. రేవంత్ ఏం చేసినా శ్రీసత్య ఏదో ఒకటి అనడంతో రేవంత్ గట్టి గట్టిగా అరిచాడు. కాళ్లు అడ్డం పెట్టాడని అర్జున్‌ను రేవంత్‌, నెట్టేశాడని ఆదిరెడ్డిని వాసంతి కొట్టారు. కొట్టుకోకండి అని శ్రీసత్య అరుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. మొత్తానికి ఈ టాస్క్ రెండు టీమ్స్ మధ్య బాగా గొడవలు పెట్టింది. బిగ్‌బాస్‌ టీఆర్పీ కోసం గేమ్ పద్ధతి మార్చిన సంగతి అర్ధమవుతుంది. దీంతో కావాలనే ఇలాంటి టాస్క్ ఇచ్చాడు అని తెలుస్తుంది.