Guppedantha Manasu
Guppedantha Manasu : కాలేజీలో జగతి సంతాప సభ ఏర్పాటు చేస్తారు. మహేంద్ర, రిషి ఆ కార్యక్రమానికి రాలేమంటారు. తల్లిని చంపిన వారిని వదిలిపెట్టేది లేదని రిషి చెప్పడంతో దేవయానిలో వణుకు మొదలవుతుంది. ‘గుప్పెడంత మనసు సీరియల్’లో ఏమైంది?
జగతిని చంపింది ఎవరో రిషి వదిలిపెట్టనని చెప్పడంతో దేవయానిలో భయం మొదలవుతుంది. శైలేంద్రతో అదే విషయం ప్రస్తావిస్తుంది. తనకు ధైర్యం చెప్పకుండా భయపెడతావేంటని తల్లిపై శైలేంద్ర చిరాకు పడతాడు. రిషి పక్కన ఇప్పుడు వసుధర కూడా ఉంది..అందుకే ఈ భయం అంటుంది దేవయాని. ఏది ఏమైనా తను అనుకున్నది చేస్తానంటాడు శైలేంద్ర.
కాలేజీలో జగతి సంతాప సభ చేయాలని నిర్ణయిస్తారు. ఆ కార్యక్రమానికి తాను రాలేనంటాడు మహేంద్ర. రిషి కూడా రానంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో మహేంద్ర వెళ్తాడు. వసుధర కూడా అతనితో వెళ్తుంది. అందరూ జగతికి నివాళులు అర్పిస్తారు. ఇంటి దగ్గర ఉన్న రిషి తల్లి జగతి ఫోటో ముందు కూర్చుని బాధపడుతుంటాడు.
జగతి చనిపోయిన తర్వాత ఖాళీ అయిన ఎండీ స్ధానంలో మహేంద్ర ఉండాలని అతని అన్న సూచిస్తాడు. అందుకు మహేంద్ర విముఖత చూపిస్తాడు. తాను ఉన్న పరిస్థితుల్లో ఆ బాధ్యతను నిర్వర్తించలేనని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఖాళీగా ఉన్న కాలేజీ ఎండీ స్ధానంపై శైలేంద్ర కన్నేస్తాడు. అతను ఆశపడ్డట్లు ఆ సీటు శైలేంద్రకు దగ్గుతుందా? నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే..
‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాపుగంటి రాజేంద్ర ఈ సీనియల్‌ను డైరెక్ట్ చేస్తున్నారు.