Guppedantha Manasu : శైలేంద్ర నెక్ట్స్ టార్గెట్ రిషీయేనా? జగతి మరణం తర్వాత ‘గుప్పెడంత మనసు’ సీరియల్లో ఏం జరగబోతోంది?
జగతి చనిపోయిన తర్వాత మహేంద్ర తీవ్రంగా కుమిలిపోతాడు. మరోవైపు శైలేంద్ర తన కుట్రలు కంటిన్యూ చేస్తాడు. జగతి లేకుండా 'గుప్పెడంత మనసు' సీరియల్ ఎటువంటి మలుపులు తిరగబోతోంది?

Guppedantha Manasu
Guppedantha Manasu : తీవ్ర భావోద్వేగాల మధ్య జగతి అంత్యక్రియలు నిర్వహించి మహేంద్ర కుటుంబసభ్యులు ఇంటికి వస్తారు. మహేంద్ర జగతిని తల్చుకుని కుమిలిపోతుంటాడు. దేవయాని, శైలేంద్ర మళ్లీ కుట్రలు మొదలుపెడతారు. ‘గుప్పెడంత మనసు’ సీరియల్లో ఏం జరిగింది.
Guppedantha Manasu : జగతి మేడం చనిపోయింది.. గుప్పెడంత మనసు సీరియల్లో భారీ ట్విస్ట్
మహేంద్ర జగతిని తల్చుకుని కుమిలిపోతుంటాడు. రిషి మహేంద్ర వెంట ఉండి ఓదారుస్తూ ఉంటాడు. రిషి వసుధరని తల్లి మరణానికి కారణం ఎవరో చెప్పమంటాడు. వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అంటాడు. వసుధర ఆవేశంలో ఏ నిర్ణయాలు తీసుకోవద్దని రిషికి చెబుతుంది. జగతి మరణం వల్ల ఏర్పడిన బాధ నుంచి కాస్త కోలుకునేవరకు వెయిట్ చేయమంటుంది. రిషికి తోడుగా ఉంటానని చెబుతుంది.
దేవయాని, శైలేంద్ర జగతి ఫోటో ముందు నిలబడి జగతి, రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. జగతిని తాము చంపిన విషయం బయటపడుతుందేమో అని భయం వేస్తోందంటుంది దేవయాని. తల్లికి భయపడొద్దు అని చెప్పిన శైలేంద్ర త్వరలోనే రిషి చావుకి స్కెచ్ వేస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
Jyothi Rai : టాలీవుడ్ డైరెక్టర్ని పెళ్లాడబోతున్న ‘గుప్పెడంత మనసు’ జగతి మేడం..
జగతి జ్ఞాపకాలను తల్చుకుని మహేంద్ర, రిషీ, వసుధర కుమిలిపోతుంటారు. జగతి పాత్ర ముగిసిన ఈ సీరియల్ ఇప్పుడు ఎటువంటి మలుపులు తిరగబోతోంది? నెక్ట్స్ ఎపిసోడ్ వరకూ ఎదురుచూడాల్సిందే. ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ను కాపుగంటి రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.