బాలయ్య వ్యాఖ్యలపై టాలీవుడ్ రెండుగా చీలుతోందా?

  • Publish Date - May 30, 2020 / 09:28 AM IST

బాలకృష్ణ వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానైయ్యాయి. బాలయ్య, మాటలు జాగ్రత్త అంటూ ముందు నాగబాబు గళమెత్తి, ఆజ్యం పోశారు. అక్కడ నుంచి ఇండస్ట్రీలో రెండు వాదనలొచ్చాయి. చిరంజీవి తనకు నచ్చినవాళ్లతోనే మీటింగ్స్ పెడుతున్నారు. సిఎం కేసీఆర్‌ను కలిశారు. జగన్‌నూ కలవబోతున్నారు. ఆయన అందరీ కలుపుకుపోవట్లేదన్న గుసగుసలొచ్చానా… రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయనకున్న సాన్నిహిత్యం… వాటి పరమార్ధం అర్ధమైన తర్వాత ఎవరూ నోరుమెదపలేదు. సరిగ్గా ఈ టైంలోనే నిర్మాత ప్రసన్నకుమార్ బాలయ్యకు జై కొట్టారు.

బాలయ్య అభిప్రాయం ఆయనదిమాత్రమేకాదు. మా అందరిదీ. మేం చెప్పలేకపోయాం…ఆయన బైటపెట్టారని తేల్చేశారు. అసలు ఈ సమావేశం గురించి నరేశ్‌, జీవితా రాజశేఖర్‌, ఫిలిమ్‌ ఛాంబర్‌, కౌన్సిల్‌లోని సభ్యులెవరికీ తెలియదని అన్నారు. చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ ఇండస్ట్రీకి రెండు కళ్లు… ఇండస్ట్రీ సమస్య అందరిదరిది. చిరంజీవి అందరినీ కలుపుకుపోవాలన్నట్లుగా మాట్లాడారు. అంతకుముందే, ఈ అనుకోకుండా పుట్టిన ఈ నిప్పుకు నీళ్లుచల్లే ప్రయత్నం చేశారు సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.

టాలీవుడ్‌కు మంచి జరుగుతుందనుకుంటే మెగాస్టార్‌ చిరంజీవనే కాకుండా ఎవ్వరితోనైనా కలిసి నడుస్తామన్నారు. చిరంజీవి ఇంట్లో సమావేశం ఆయన స్వలాభం కోసం పెట్టలేదు, ఈ భేటీని పెద్ద ఇష్యూగా చేస్తున్నారని తప్పుపట్టారు. దాసరి నారాయణరావు ఇంట్లో అనేకసార్లు మీటింగ్స్ జరిగాయి. అప్పడులేని రాద్ధాంతం ఇప్పుడెందుకని అన్నారు. అసలు ఇది ఇండస్ల్రీ మీటింగ్ కానేకాదన్నారు. తలసానే చొరవచూపారని చెప్పారు. బాలకృష్ణ, నాగబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తాని అంటూ, బాలయ్య చేయని వ్యాఖ్యలను చేసినట్లు  చూపుతున్నారని మండిపడ్డారు.

బాలకృష్ణ, చిరంజీవిలతో మాట్లాడామని ఈ సమస్య ఇక్కడే పరిష్కారం అయిందనే అనుకుంటున్నట్లు తమ్మారెడ్డి తెలిపారు. ఈ వివాదానికి ములమెక్కడంటే…కేసీఆర్‌తో చిరు అండ్ కో మీటింగ్‌కు తనను పిలవలేదని.. ఆ విషయం గురించి తనకు తెలియదని బాలయ్య అన్నారు. తలసానితో కలిసి హైద్రాబాదులో భూములు పంచుకుంటున్నారా.. అని బాలయ్య వ్యాఖ్యానించడంతోనే రచ్చ.  బాలయ్య వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు వీడియో రిలీజ్ చేసారు. బాలయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని, కింగ్ కాదు జస్ట్ హీరో అంతేనంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలతో సంచలనం. 

Read: ఇక నెక్ట్స్ మేమే వస్తాం.. టీడీపీపై నాగబాబు ట్వీట్ ఫైర్