Within hours of the release of Allu Arjun Pushpa 2 the entire movie was leaked in online
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా నేడు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అలా రిలీజ్ అయ్యిందో లేదో ఇలా ఆన్ లైన్ లో మొత్తం సినిమా లీక్ అయ్యింది. ఇది ఎవరు చేసిన పనో తెలీదు కానీ సినిమా మొత్తాన్ని HD ప్రింట్ లో లీక్ చేశారు. పుష్ప సినిమా ఒక్కటీ, రెండు వెబ్ సైట్ లలో మాత్రమే కాదు ఏకంగా పదుల సంఖ్యల వెబ్ సైట్ లలో రావడం షాకింగ్ గా ఉంది. ఇది సరిపోదనట్టు లీక్డ్ వెర్షన్ ను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే లింకులు కూడా కల్పించారు మాహానుభావులు.
ఈ దెబ్బకి ఈ సినిమా పరిస్థితి ఏంటా అని అయోమయంలో పడ్డారు చాలా మంది. మరి ఈ విషయానికి సంబంధించి మూవీ టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే పలు సినిమాల విషయంలో ఇలా జరిగినప్పటికీ.. బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా అయిన పుష్ప కి జరగడం మాత్రం షాకింగ్ గా ఉందనే చెప్పాలి. భారీ బడ్జెట్ తో.. ప్రపంచవ్యాప్తంగా విదుదలైన ఈ సినిమా మొదటి షో నుండే మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.
Also Read : Miheeka Daggubati : నాగచైతన్య పెళ్లి.. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ ఫోటో షేర్ చేసిన రానా భార్య..
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఫహాద్ ఫాసిల్, అనసూయ, సునీల్ పలు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.