Miheeka Daggubati : నాగచైతన్య పెళ్లి.. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ ఫోటో షేర్ చేసిన రానా భార్య..
నాగచైతన్య పెళ్లి పనులను దగ్గరుండి జరిపించారు దగ్గుబాటి ఫ్యామిలీ.

Akkineni and Daggubati family photos shared by Rana wife Miheeka
Miheeka Daggubati : అక్కినేని వారసుడు నాగచైతన్య పెళ్లి కొడుకు అయ్యాడు. శోభిత మెడలో మూడు ముళ్ళు కట్టి ఓ ఇంటివాడయ్యాడు. వీరి ఇద్దరి వివాహం నిన్న రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. అతి కొద్ది మంది కుటుంబ సభ్యల మధ్య అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక్కటయ్యారు నాగచైతన్య, శోభిత. గత రెండు ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
Also Read : Pushpa 2 : ఫాన్స్ కి, ప్రేక్షకులకి భారీ షాక్ ఇచ్చిన హైదరాబాద్ బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్..
ఇక వీరి పెళ్లి వేడుకల్లో దగ్గుబాటి ఫ్యామిలీ ఆకర్షణీయంగా నిలిచింది. నాగచైతన్య పెళ్లి పనులను దగ్గరుండి జరిపించారు దగ్గుబాటి ఫ్యామిలీ. ఇప్పటికే కొత్త జంట ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా దగ్గుబాటి కోడలు రానా భార్య మిహీక సైతం చైతన్య పెళ్ళికి సంబందించిన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ఇక ఆ ఫొటోలో అక్కినేని ఫ్యామిలీతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ అందరూ కూడా ఉన్నారు. దీంతో ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.
View this post on Instagram
ఇక ఆ ఫొటోలో.. అక్కినేని హీరో కొత్త పెళ్ళికొడుకు నాగచైతన్యతో పాటు అక్కినేని సుమంత్, అక్కినేని సుశాంత్, దగ్గుబాటి కోడలు మిహీక, వెంకటేష్ ఇద్దరు కూతుళ్లలతో పాటు ఇరు కుటుంబ సభ్యలు ఉన్నారు. కొత్త పెళ్ళికొడుకు నాగచైతన్య ఫోటో షేర్ చేస్తూ..”పెళ్ళికొడుకు” అని దానికి ఒక క్యాప్షన్ కూడా పెట్టింది. ఇక వెంకటేష్ అక్కినేని నాగచైతన్య కి స్వయానా మామయ్య అవుతారు. వీళ్ళ అందరిదీ ఒకే కుటుంబం కాబట్టి దగ్గుబాటి ఫ్యామిలీ దగ్గరుండి చైతు పెళ్లి చేయించారు.