Pushpa 2 : ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకి భారీ షాక్ ఇచ్చిన హైదరాబాద్ బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యి థియేటర్స్ లోకి వచ్చింది.

Pushpa 2 : ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకి భారీ షాక్ ఇచ్చిన హైదరాబాద్ బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్..

Hyderabad biggest multiplex gave a huge shock to Pushpa 2 movie fans

Updated On : December 5, 2024 / 1:45 PM IST

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యి థియేటర్స్ లోకి వచ్చింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన ఈ సినిమా ప్రీమియర్స్ నిన్న రాత్రి నుండే స్టార్ట్ చెయ్యడంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ మూవీ రిలీజైన మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఆడియన్స్ తో పాటు మూవీ టీమ్ కూడా పుష్ప 2 సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే ఇప్పటికే పుష్ప 2 సినిమా కొన్ని వందల థియేటర్స్ లో విడుదలై ఆకట్టుకుంటుంది. కానీ థియేటర్స్ లోనే అతిపెద్ద థియేటర్ అయిన ప్రసాద్స్ ఐమాక్స్ లో మాత్రం ఈ సినిమాను రిలీజ్ చెయ్యలేదు. ఏదైనా ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ముందుగా అందరికీ ఈ థియేటర్ లోనే సినిమా చూడాలన్న ఆలోచన వస్తుంది. ఎక్కువ జనాలు ఈ థియేటర్ లోనే సినిమా చూడడానికి ఇష్టపడతారు. అలాంటిది ఈ సినిమా బుకింగ్స్ కూడా ఓపెన్ చెయ్యలేదు నిర్వాహకులు. అయితే తాజాగా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. దీనికి సంబందించిన ఓ పోస్ట్ రీలీజ్ చేశారు.

Also Read : Rishab Shetty : వామ్మో.. రిషబ్ శెట్టి మూవీ లైనప్ చూసారా.. ఏకంగా అన్ని సినిమాలా..

ఇక పోస్ట్ లో.. ” మా విలువైన పార్ట్నర్ కి..గత రెండు దశాబ్దాలుగా, సినీ ప్రేక్షకులకు మంచి సినిమా అనుభూతిని అందిస్తున్నాము. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తూ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మేము మీకు ఇష్టమైన ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో పుష్ప 2 సినిమాని ప్రదర్శించలేకపోయాము. దీని వల్ల మీకు ఏదైనా అసౌకర్యాన్ని కలిగించి ఉంటే క్షమించండి. మమ్మల్ని అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు” అంటూ తెలిపారు. ఎంతో ఇష్టంతో ఈ సినిమాను ప్రసాద్స్ లో చూడాలనుకున్న ఆడియన్స్ ఈ విషయం తెలిసి నిరాశ చెందుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Prasads Multiplex (@prasadsmultiplx)


అయితే ప్రసాద్స్ ఐమాక్స్ లో పుష్ప 2 సినిమా రాకపోవడానికి కారణం మైత్రీ మూవీ మేకర్స్ కారణమని తెలుస్తుంది. పుష్ప 2 గ్రాస్ క‌లెక్ష‌న్‌కి సంబంధించి 55% డిస్ట్రిబ్యూటర్‌కి ఇవ్వాలని ఇప్పటికే పలు థియేటర్స్ ఒప్పుకున్నాయి. అందులో పీవీఆర్‌తో పాటు, ఏషియ‌న్ సినిమాలు ఉన్నాయి. కానీ ప్రసాద్స్ మాత్రం దీనికి ఒప్పుకోలేదట. ప్ర‌సాద్స్ యాజ‌మాన్యం 52% మాత్రమే షేర్‌గా ఇవ్వాల‌ని అన్నారట. మైత్రి మేక‌ర్స్ మాత్రం ఆ 3 % కూడా ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంతో దీనికి ప్ర‌సాద్స్ అంగీకరించడం లేదని సమాచారం. అందుకే ప్రసాద్స్ లో పుష్ప 2 రాలేదని అంటున్నారు.