Rishab Shetty : వామ్మో.. రిషబ్ శెట్టి మూవీ లైనప్ చూసారా.. ఏకంగా అన్ని సినిమాలా..

తాజాగా రిషబ్ శెట్టి అప్ కమింగ్ సినిమాలకి సంబందించిన అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Rishab Shetty : వామ్మో.. రిషబ్ శెట్టి మూవీ లైనప్ చూసారా.. ఏకంగా అన్ని సినిమాలా..

Rishabh Shetty up coming Movies news goes viral

Updated On : December 5, 2024 / 11:34 AM IST

Rishab Shetty : కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే కన్నడలో వరుస సినిమాలు చేసి భారీ గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో కాంతార సినిమాతో తెలుగులో సైతం అదే స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నారు. కాంతార భారీ విజయాన్ని అందుకోవడంతో దానికి ప్రీక్వెల్ గా కాంతార వన్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా చేసారు మేకర్స్. ఈ సినిమా 2025 అక్టోబర్ 2న విడుదల కానుంది.

అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు ఈ స్టార్ హీరో. తాజాగా రిషబ్ శెట్టి అప్ కమింగ్ సినిమాలకి సంబందించిన అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది. 2025 అక్టోబర్ లో కాంతార ప్రీక్వెల్ రానుంది. కాంతార 1 సినిమా పూర్తి కాకుండానే ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంచిన పోస్టర్ సైతం రిలీజ్ చేశారు. ఇందులో ఆయన హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నారు.

Also Read : Pushpa 2 : పుష్ప 2 చూస్తూ.. థియేటర్ లో ఎంజాయ్ చేసిన పుష్ప రాజ్, శ్రీవల్లి..

అంతేకాకుండా..అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో సైతం ఓ సినిమా చేస్తున్నారట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రానుందట. అలాగే తాజాగా ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమా ప్రకటించారు. ఇక ఈ సినిమా 2027 జనవరి 21న రిలీజ్ కానుంది. ఈ సినిమాలతో పాటు కాంతార పార్ట్ 3 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇలా వరుసగా ఐదు సినిమాలు చేస్తున్నారు రిషబ్. మరి ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూడాలి.