Megastar Chiranjeevi: డిజిటల్ వరల్డ్‌ లోకి మెగా ఎంట్రీ.. ‘మెగా పోడ్‌కాస్ట్’కి రెడీ అవుతున్న చిరంజీవి

త్వరలో పాడ్ కాస్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi).

Writer Bvs Ravi is planning Mega Podcast with Megastar chiranjeevi

  • డిజిటల్ స్క్రీన్‌పై మెగాస్టార్ హంగామా.

  • చిరంజీవి లైఫ్ జర్నీతో పోడ్‌కాస్ట్.

  • రైటర్ బి.వి.ఎస్. రవి ప్లాన్.

Megastar Chiranjeevi: టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డుల రారాజు, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఇప్పుడు డిజిటల్ దునియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటివరకు వెండితెరపై కోట్ల మందిని అలరించిన ఆయన, త్వరలోనే ఒక ప్రతిష్టాత్మక ‘పోడ్‌కాస్ట్’ (Podcast) ద్వారా డిజిటల్ ఆడియన్స్‌ ముందుకు రానున్నారు. ఈ సరికొత్త టాక్ షో ద్వారా తన ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలోని అరుదైన అనుభవాలను, తెరవెనుక రహస్యాలను చిరు పంచుకోనున్నారు.

Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. లాంగ్ స్కర్ట్ లో క్రేజీ ఫోటోలు వైరల్

నందమూరి బాలకృష్ణతో ‘అన్‌స్టాపబుల్’ షోను సూపర్ హిట్ చేసిన ప్రముఖ రచయిత బి.వి.ఎస్. రవి ఈ మెగా ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని అధికారికంగా లీక్ చేశారు. శూన్యం నుండి మొదలై చిరంజీవి చేరుకున్న శిఖరాల వెనుక ఉన్న శ్రమను, ఆయన లైఫ్ జర్నీని రాబోయే తరాలకు స్ఫూర్తిగా అందించేలా ఈ షోను డిజైన్ చేస్తున్నట్లు బి.వి.ఎస్. రవి వెల్లడించారు.

గతంలో చిరు కుమార్తె సుష్మిత కొణిదెల సైతం ఈ ప్రాజెక్ట్ గురించి హింట్ ఇచ్చారు. అయితే చిరంజీవితో పనిచేసిన పరిశ్రమ దిగ్గజాలు ఈ షోకి వస్తారా? లేదా చిరు హిట్ సినిమాల వారీగా ఎపిసోడ్‌లను ప్లాన్ చేస్తారా? అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఈ క్రేజీ పోడ్‌కాస్ట్ మెగా అభిమానులకు సరికొత్త విందును అందించడం ఖాయంగా కనిపిస్తోంది.