నరేంద్రలో ఖలీ కీ రోల్

నరేంద్ర మూవీలో ఖలీ తన నిజ జీవిత పాత్రలో కనిపించబోతున్నాడు.

  • Publish Date - January 30, 2019 / 09:56 AM IST

నరేంద్ర మూవీలో ఖలీ తన నిజ జీవిత పాత్రలో కనిపించబోతున్నాడు.

డబ్ల్యు డబ్ల్యు ఈ ద్వారా వరల్డ్ ఫేమస్ అయిన, పాపులర్ ఇండియన్ రెజ్లర్ దలీవ్ సింగ్ రాణా (ఖలీ) టాలీవుడ్‌లోకి ఎంటర్ అవబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు జయంత్ సి.పరాన్జీ డైరెక్షన్‌లో నీలేష్ హీరోగా నటిస్తున్న సినిమాకి నరేంద్ర అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తూ, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.  ఈ సందర్భంగా నరేంద్ర సినిమాలో ఒక కీలక పాత్రలో నటించడానికి ఖలీ అంగీకరించినట్లు డైరెక్టర్ జయంత్ చెప్పాడు. ఖలీ ఈ సినిమాలోనూ తన నిజ జీవిత పాత్రలో కనిపించబోతున్నాడు. రెజ్లర్‌గా కొద్దిసేపు తెరపై తళుక్కు మనబోతున్నాడు ఖలీ.

మిస్టర్ మజ్నులో నటించిన బ్రెజిలియన్ మోడల్, నటి ఇసబెల్ లీత్ ఈ మూవీలో హీరోయిన్. జయంత్ ఇంతకుముందు తెలుగులో ప్రేమించుకుందాంరా, శంకర్ దాదా ఎమ్‌బిబిఎస్, లక్ష్మీ నరసింహా వంటి సూపర్ హిట్ సినిమాలు చేసాడు. జయదేవ్ తర్వాత్ ఆయన కాస్త గ్యాప్ తీసుకుని చేస్తున్న నరేంద్ర సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈషాన్ ఎంటర్‌ టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న నరేంద్ర చిత్రానికి సంగీతం : రామ్ సంపత్, ఎడిటింగ్ : మార్తాండ్ కె.వెంకటేష్.