చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా 2018 యమహా ఫాసినో ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్ మొత్తంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా పలు కేటగిరీల్లో అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ నటుడిగా రామ్ చరణ్, ఉత్తమ నటిగా కీర్తి సురేశ్ అవార్డులు గెలుచుకోగా, బెస్ట్ పాపులర్ యాక్టర్‌గా రష్మిక మంధాన సొంతం చేసుకుంది.
ఉత్తమ చిత్రం – మహానటి
ఉత్తమ దర్శకుడు– నాగ్ అశ్విన్ (మహానటి)
లీడింగ్ రోల్ లో ఉత్తమ నటుడు(పాపులర్) – రామ్ చరణ్ (రంగస్థలం)
విమర్శకుల ఉత్తమ నటుడు– దుల్కర్ సల్మాన్(మహానటి)
ఫిమేల్ కేటగిరీలో ఉత్తమ నటి(పాపులర్) – కీర్తి సురేశ్ (మహానటి)
విమర్శకుల ఉత్తమ నటి– రష్మీక మంధాన(గీతా గోవిందం)
ఉత్తమ సహనటుడు (Male) – జగపతి బాబు (అరవింద సమేత వీర రాఘవ)
ఉత్తమ సహనటి (Female) – అనసూయ భరద్వాజ్ (రంగస్థలం)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ – దేవీ శ్రీ ప్రసాద్ (రంగస్థలం)
ఉత్తమ లిరిక్స్ – చంద్రబోస్ – ఎంత సక్కగున్నవే(రంగస్థలం)
ఉత్తమ ప్లే బాక్ సింగర్– సిద్ శ్రీరామ్ – ఇంకేం ఇంకేం కావాలే (గీతా గోవిందం)
ఉత్తమ ప్లే బాక్ సింగర్ (Female) – శ్రేయా గోషల్ – మందారా మందారా (భాగమతి)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – ఆర్ రత్నవేలు (రంగస్థలం)