Yash next movie with national award winner Geetu Mohandas
Yash : కన్నడ స్టార్ యశ్ (Yash) కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. కేజీఎఫ్ 2 (KGF 2) తో ఏకంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్ అందుకొని ఇండియన్ నెంబర్ వన్ మూవీగా నిలిచింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కన్నడ చిత్రాలు పై ఆసక్తి చూపించేలా చేసింది. నిన్నటితో (ఏప్రిల్ 14) ఈ సినిమా విడుదలయ్యి ఏడాది పూర్తి చేసుకుంది. అయినా ఇప్పటి వరకు యశ్ మరో సినిమా ప్రకటించలేదు. దీంతో పాన్ ఇండియా వైడ్ ఉన్న యశ్ అభిమానులు నెక్ట్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
KGF 3 : చరిత్ర సృష్టించిన KGF 2కు వన్ ఇయర్.. పార్ట్ 3పై అప్డేట్ ఇచ్చిన హోంబలె ఫిలిమ్స్..
తాజాగా యశ్ తదుపరి ప్రాజెక్ట్ గురించి కన్నడనాట ఒక వార్త బయటకి వచ్చింది. మొదటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ (Geetu Mohandas) కలిసి యశ్ తన నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడట. లైయర్స్ డైస్ (Liar’s Dice) సినిమాతో డైరెక్టర్ గా పరిచమైన మలయాళ నటి గీతు మోహన్, యశ్ కి ఒక కథని వినిపించిందట. ఇక కథలకు ప్రాధాన్యత ఇస్తూ రిస్క్ లు చేసే యశ్ కి ఆ కథ చాలా ఛాలెంజింగ్ అనిపించడంతో ఓకే చెప్పినట్లు, దీని పై కొంత కాలంగా వర్క్ కూడా చేస్తున్నట్లు సమాచారం.
త్వరలోనే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నట్లు కన్నడ పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే, నిన్న కేజీఎఫ్ 3 ని ప్రకటిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో రాఖీ భాయ్ 1971 నుంచి 1981 మధ్య కాలంలో ఎక్కడ ఉన్నాడు? ఆ టైంలో రాఖీ ఏమి చేశాడు అనే కథనంతో థర్డ్ పార్ట్ ఉండబోతుందని తెలియజేశారు. 2025లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.