Yash Toxic Movie Release Date Announced
Toxic : కేజిఎఫ్ తర్వాత యశ్ ఫ్యాన్స్ ఎంతగానో యశ్ నెక్స్ట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. రాకింగ్ స్టార్ యశ్ ప్రస్తుతం డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, KVN ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై యశ్, వెంకట రమణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
Also Read : Laila – Maheswari : 2 దశాబ్దాలుగా కలవని ఒకప్పటి స్టార్ హీరోయిన్స్.. ఒక్కసారి కూడా కలవకుండా.. ఇన్నాళ్లకు..
యశ్ టాక్సిక్ సినిమా వచ్చే ఉగాదికి 2026 మార్చ్ 19 న రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ నేడు అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.
టాక్సిక్ సినిమాని కేవలం పాన్ ఇండియా రిలీజ్ మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. టాక్సిక్ సినిమాని కన్నడతో పాటు ఇంగ్లీష్ లో కూడా తెరకెక్కిస్తున్నారు.