Toxic : వామ్మో ‘టాక్సిక్’ హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలో తెలుసా? ఈ టాక్ తో అవుతుందా?
ఈ సినిమాకు రిలీజ్ కి ముందు అంచనాలు భారీగా ఉండటంతో థియేటరికల్ బిజినెస్ బాగానే జరిగింది. (Toxic)
Toxic
Toxic : కెజిఎఫ్ తర్వాత చాలా గ్యాప్ తో యశ్ నుంచి వచ్చిన ‘టాక్సిక్’ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాలో నయనతార, రుక్మిణి వసంత్, తార సుతారియా, హ్యూమా ఖురేషి, కియారా అద్వానీ.. ఇలా అయిదుగురు హీరోయిన్స్ నటించడం, టీజర్, గ్లింప్స్, ట్రైలర్స్, సాంగ్స్ తో సినిమాలో రొమాన్స్ ఎక్కువగా ఉందని హింట్ ఇవ్వడంతో హైప్ నెలకొంది. టాక్సిక్ సినిమా నేడు ఆగస్టు 26న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది.
అయితే ఈ సినిమాకు మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్ వస్తుంది. యాక్షన్, రొమాన్స్ భారీగా ఉండటం, ఎమోషన్ ఏదో వర్కౌట్ అవ్వకపోవడం, బాగా సాగదీయడం, అక్కర్లేని సన్నివేశాలు, క్లైమాక్స్ లో సైకలాజికల్ సీన్స్ పెట్టడం.. ఇలాంటి వాటితో ఈ సినిమా ప్రేక్షకులను, ఫ్యాన్స్ ని మెప్పించలేకపోయింది. కెజిఎఫ్ తర్వాత ఏకంగా వెయ్యి, రెండు వేల కోట్లు కొడతారు అని అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ టాక్ చూస్తుంటే అసలు వెయ్యి కోట్లు కొడుతుందా అనే డౌట్ వస్తుంది.
Also See : Krithi Shetty : ఆభరణాలతో అందంగా.. ఓనం పండగ స్పెషల్.. కృతిశెట్టి ఫొటోలు..
ఈ సినిమాకు రిలీజ్ కి ముందు అంచనాలు భారీగా ఉండటంతో థియేటరికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఈ సినిమాకు యశ్ కన్నడ హీరో కావడంతో కన్నడలో ఏకంగా 100 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మారు. నైజాం 45 కోట్లకు, ఆంద్ర 45 కోట్లకు, సీడెడ్ 10 కోట్లకు.. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కూడా 100 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కొన్నారు దిల్ రాజు. తమిళనాడు 45 కోట్లు, కేరళ 15 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 75 కోట్లు, ఓవర్సీస్ 70 కోట్లకు అమ్ముడయ్యాయి.
మొత్తంగా 405 కోట్లకు ప్రపంచవ్యాప్తంగా టాక్సిక్ సినిమా థియేటరికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 410 కోట్ల షేర్ కావాలి. అంటే దాదాపు 820 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ఇక క్లీన్ హిట్ అవ్వాలంటే 900 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సిందే. ఈ సినిమాకు వెయ్యి కోట్ల గ్రాస్ టార్గెట్ పెట్టుకొని దిగారు. మరి ఈ టాక్ తో అన్ని కోట్లు వస్తాయా చూడాలి. అయితే ముందు నుంచి ఉన్న హైప్ తో ఓపెనింగ్స్ భారీగానే ఉన్నాయి, టికెట్ రేట్లు కూడా పెంచారు. మరి ఇవేమైనా కలిసొచ్చి టాక్సిక్ కి వెయ్యి కోట్లు కలెక్షన్స్ వచ్చి హిట్ అవుతుందేమో చూడాలి.
Also Read : Toxic Review : ‘టాక్సిక్’ మూవీ రివ్యూ.. పిల్లల్ని మాత్రం తీసుకెళ్లొద్దు.. కేవలం పెద్దలకు మాత్రమే..
