Toxic Ticket Prices : టాక్సిక్ మూవీ యూనిట్‌కు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..
యశ్ టాక్సిక్ చిత్ర బృందానికి (Toxic Ticket Prices) తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Yash Toxic Ticket Prices hikes in Telangana
Toxic Ticket Prices : స్టార్ హీరో యశ్ నటించిన చిత్రం టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం బుధవారం (ఆగస్టు 26) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
సింగిల్ స్క్రీన్లలో రూ.50 (జీఎస్టీ కలిపి), మల్టీప్లెక్స్‌లలో రూ.100 (జీఎస్టీ కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలు 10 రోజుల పాటు అమల్లో ఉంటాయని తెలిపింది. అలాగే రోజుకు 5 షోలను ప్రదర్శించుకోవచ్చునని చెప్పింది. అదే సమయంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు రూ.1 కోటి ఇవ్వాలని చిత్ర నిర్మాణ సంస్థ కేవీయస్ ప్రొడక్షన్స్‌కు సూచించింది.
Bhanu Sri : తిరుమల శ్రీవారి సేవలో బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ..
నయనతార, కియారా అద్వాణీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 3 గంటలా 14 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.
