Ambati Rambabu : పుష్ప 2 సినిమాని ఎవరూ ఆపలేరు.. అల్లు అర్జున్ ఎదుగుతుంటే కొంతమందికి జెలస్.. అంబటి రాంబాబు వ్యాఖ్యలు..

తాజాగా వైసీపీ నేత అంబటి రాంబాబు పుష్ప 2 సినిమా గురించి మాట్లాడారు.

YCP Leader Ambati Rambabu Comments on Allu Arjun Pushpa 2 Movie goes Viral

Ambati Rambabu : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5 న రానుంది. ప్రస్తుతం పుష్ప 2 మూవీ యూనిట్ వరుస భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజయిన సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ మాత్రమే కాక దేశవ్యాప్తంగా ప్రేక్షకులు పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే గతంలో అల్లు అర్జున్ వైసీపీ నేతకు సపోర్ట్ గా ప్రచారం చేయడంతో అప్పట్నుంచి మెగా ఫ్యాన్స్, జనసైనికులు అల్లు అర్జున్ ని వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై విమర్శలు చేస్తున్నారు. కొంతమంది పుష్ప 2 సినిమాని తిప్పికొడతాం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి వాటిపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. నేడు జరిగిన ఓ ప్రెస్ మీట్ లో ఓ జర్నలిస్ట్ ఈ పుష్ప 2 వివాదం గురించి అడిగారు.

Also Read : Pushpa 2 Event : పాట్నా, చెన్నై అయిపోయాయి.. నెక్స్ట్ ‘మల్లు’ అర్జున్ అడ్డా.. కేరళలో పుష్ప 2 ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ?

దీనికి అంబటి రాంబాబు స్పందిస్తూ.. అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా పుష్ప పార్ట్ 2ని చూడకుండా ఎవరూ ఆపలేరు. ఎన్టీఆర్ సినిమాని బహిష్కరించాలని ప్రయత్నం చేసారు. కానీ ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని చూస్తే ప్రజలు ఊరుకోరు. బాగున్న సినిమాని ఎవరూ ఆపలేరు. అరచేతిని పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఇలాంటి పోకడలు పోయి సినిమాని ఆపలేరు అని తెలుస్తుంది. అల్లు అర్జున్ అయినా, జూనియర్ ఎన్టీఆర్ అయినా ఎవరి సినిమా అయినా బాగుంటే ఆపలేరు. అందరూ పుష్ప 2 సినిమా చూడాలని ఎదురుచూస్తున్నారు. నేను కూడా ఎదురుచూస్తున్నాను. పుష్ప పార్ట్ 1 అద్భుతంగా ఉంది. హాలీవుడ్ స్టైల్ లో ఉంది. అందర్నీ తలదన్నే విధంగా ఎదిగాడు కదా అల్లు అర్జున్. అందుకే కొంతమందికి జెలసీ గా ఉంది. ఆ జెలస్ తో మీ కడుపులు పుచ్చిపోతాయి. పైకెళ్ళేవాడ్ని ఎవరూ ఆపలేరు. జూనియర్ ఎన్టీఆర్ ని, అల్లు అర్జున్ ని బహిష్కరించాలని ఎవరు అనుకున్నా అవ్వదు. అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు ఇప్పుడు అని అన్నారు.

దీంతో అంబటి రాంబాబు వ్యాఖ్యలు వైరల్ గా మారగా బన్నీ ఫ్యాన్స్ అంబటి వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు. మరి దీనిపై మెగా ఫ్యాన్స్, జనసైనికులు ఎలా స్పందిస్తారో చూడాలి.