Pushpa 2 Event : పాట్నా, చెన్నై అయిపోయాయి.. నెక్స్ట్ ‘మల్లు’ అర్జున్ అడ్డా.. కేరళలో పుష్ప 2 ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ?

నెక్స్ట్ అల్లు అర్జున్ కి తెలుగు రాష్ట్రాల తర్వాత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న కేరళలో ఈవెంట్ చేస్తున్నారు.

Pushpa 2 Event : పాట్నా, చెన్నై అయిపోయాయి.. నెక్స్ట్ ‘మల్లు’ అర్జున్ అడ్డా.. కేరళలో పుష్ప 2 ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ?

Allu Arjun Pushpa 2 Movie kerala Event Details Here

Updated On : November 25, 2024 / 1:34 PM IST

Pushpa 2 Event : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. ఇప్పటికే పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా నిన్న చెన్నైలో సాంగ్ లాంచ్ తో వైల్డ్ ఫైర్ ఈవెంట్ నిర్వహించారు. రెండు ఈవెంట్స్ భారీ సక్సెస్ అయి పుష్ప 2 హైప్ మరింత పెంచాయి. నెక్స్ట్ అల్లు అర్జున్ కి తెలుగు రాష్ట్రాల తర్వాత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న కేరళలో ఈవెంట్ చేస్తున్నారు.

Also Read : Mahesh Babu : హిందీ బిగ్‌బాస్ లో మహేష్ బాబుని పొగిడిన సల్మాన్ ఖాన్.. బిగ్‌బాస్ లో మహేష్ మరదలు..

కేరళలో రెగ్యులర్ గా బన్నీ సినిమాలు రిలీజవుతాయని తెలిసిందే. అక్కడ కూడా బన్నీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ అందరూ మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు బన్నీని. బన్నీకి ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా ఉన్నాయి అక్కడ. దీంతో కేరళలో బన్నీ ఈవెంట్ అంటే భారీ అంచనాలు నెలకొంటున్నాయి. కేరళ రాష్ట్రం కొచ్చిలో 27వ తారీకు సాయంత్రం గ్రాండ్ హయత్ లో పుష్ప 2 ఈవెంట్ నిర్వహించనున్నారు.

Image

అసలు బన్నీకి అంతగా ఫాలోయింగ్ లేని పాట్నా, చెన్నై నగరాల్లోనే భారీగా ఈవెంట్ నిర్వహించి, లక్షల్లో జనాలు వస్తే ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్న కేరళలో ఈవెంట్ ఏ రేంజ్ లో జరుగుతుందో అని బన్నీ ఫ్యాన్స్ కేరళ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి కేరళలో పుష్ప 2 సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. ఇటీవల కేరళ డిస్ట్రిబ్యూటర్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ ప్రెస్ మీట్ లో.. మొదటి రోజు రోజంతా షోలు ఉండేలా ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు. దీన్నిబట్టే అక్కడ పుష్ప 2 హైప్ ఏ రేంజ్ లో ఉందొ తెలుస్తుంది.