Just A Minute : ఏడు చేపల కథ హీరో ఈ సారి ‘జస్ట్‌ ఏ మినిట్‌’ అంటూ.. టీజర్‌ విడుదల..

అభిషేక్‌ పచ్చిపాల, నాజియాఖాన్‌, వినీషా, ఇషిత నటీనటులుగా రూపొందుతున్న చిత్రం జస్ట్‌ ఏ మినిట్‌. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు

Yedu Chepala Katha Movie hero abhishek new movie Just A Minute Teaser released

Just A Minute Teaser : అభిషేక్‌ పచ్చిపాల, నాజియాఖాన్‌, వినీషా, ఇషిత నటీనటులుగా రూపొందుతున్న చిత్రం ‘జస్ట్‌ ఏ మినిట్‌’. రెడ్‌ స్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంతో కలిసి డా.ధర్మపురి ప్రకాష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్ణస్‌ యశ్వంత్‌ దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్‌ పనుల్లో ఉంది. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌ చూసిన ప్రతి ఒక్కరు చక్కని ప్రశంసలు అందించారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో చిత్రాన్ని థియేటర్‌లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Sequel Movies : సీక్వెల్స్ లో మారిపోతున్న హీరోలు..

దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘‘చక్కని ప్రేమకథతో సాగే వినోదాత్మక చిత్రమిది. ‘ఏడు చేపల కథ’ సినిమాతో ప్రేక్షకాదరణ పొందిన అభిషేక్‌ పచ్చిపాల ఇందులో హీరోగా చక్కని నటన కనబర్చారు. ఆయన సినిమా సినిమాకు డిఫరెంట్‌ జానర్‌ కథలు ఎంచుకుంటున్నారు. ‘ఏడు చేపల కథ’తో ఎంటర్‌టైన్‌మెంట్‌, ‘వైఫై’ చిత్రంతో ఫ్యామిలీ డ్రామాతో అలరించారు. ఇప్పుడీ చిత్రంతో కామెడీ, లవ్‌ ఎంటర్‌టైనర్‌తో అలరించనున్నారు. జబర్దస్త్‌ ఫణి కామెడీ హైలైట్‌గా ఉంటుంది. టీజర్‌కు చక్కని స్పందన వస్తోంది. ‘బుల్లెట్‌ బండి’తో పాపులర్ అయిన ఎస్‌.కె.బాజీ ఈ చిత్రానికి చక్కని బాణీలు అందించారు. పదహారేళ్ళ రేయాన్ మహ్మద్ ఈ చిత్రం టైటిల్ ట్రాక్ చేయడం విశేషం. ఇందులో ఉన్న నాలుగు పాటలు ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం సెన్సార్‌ పనుల్లో ఉంది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం’ అని అన్నారు.